English | Telugu
స్టేజి పై వర్షని పెళ్లి చేసేసుకున్న ఇమ్మానుయేల్!
Updated : Nov 5, 2022
జబర్దస్త్ షోలో రియల్ అండ్ రీల్ పెయిర్లు ఎన్నో ఉన్నాయి. అందులో వర్ష, ఇమ్ము పెయిర్ కూడా అలాంటిదే..కానీ వీళ్ళు నిజంగా లవ్ చేసుకుంటున్నట్లు వాళ్ళే చాలా సార్లు చాలా స్టేజెస్ మీద చెప్పుకొచ్చారు. ఐతే ఇద్దరి మధ్య ఏమయ్యిందో ఏమో కానీ కొంత కాలం నుంచి విడివిడిగా ఉంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ లో ఇమ్ము వర్ష కోసం ఎమోషనల్ అవడాన్ని చూపించారు.
ఇక ఇప్పుడు ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదిరిందో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజి మీద వర్ష మెడలో తాళి కట్టేసాడు ఇమ్ము. ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "బతుకు బస్టాండ్" అనే స్కిట్ లో వర్ష, ఇమ్ము మధ్య గతంలో జరిగినవి ప్లే చేసి చూపించారు. దాంతో "మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది కదా" అని పోసాని అడిగేసరికి "ఈ విషయం ఆమెకు చెప్పండి" అన్నాడు ఇమ్ము "నువ్వు పెద్ద దొంగోడివి" అని పోసాని కౌంటర్ వేసేసరికి "అందరి ముందు చెప్తున్నాను నా మీద వర్షకి ప్రేమ ఉందని చెప్తే ఇప్పటికిప్పుడు తాళి కట్టేస్తాను " అని అనౌన్స్ చేసేసాడు. దాంతో పోసాని ఇమ్ము దగ్గరకు వచ్చి "ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు అనవసరం..నీ నిజాయితీ నాకు నచ్చింది..ఐ లవ్ యు" అన్నారు. వెంటనే గెటప్ శీను తాళి తీసుకొచ్చేసరికి ఇమ్ము షాకయ్యాడు.
కానీ శీను మాత్రం వదలకుండా " ఇందాక మీరే విన్నారు కదా..తాళి బొట్టు ఉంటే పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు..అందుకే తెచ్చాను..ఇదిగో వెళ్లి కట్టు" అనేసరికి ఇమ్ము నిజంగానే పెళ్లి చేసేసుకున్నాడు. ఇక స్టేజి మీద అందరూ షాకయ్యారు..ఇకపొతే ఇది రీల్ మ్యారేజా..రియల్ మ్యారేజా ? అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాలి.