English | Telugu

మోనిత చేయించిన హ‌త్య గురించి ఆమె ముందే కార్తీక్‌కు చెప్పేసిన‌ అంజి!

'కార్తీక దీపం' కీల‌క ద‌శ‌కు చేరుకుంది. కార్తీక్ త‌న‌కు నిజం చెప్పే ఛాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డం, సౌంద‌ర్య చెప్పిన మాట‌లు కూడా న‌మ్మ‌క‌పోవ‌డంతో ఇ‌క లాభం లేద‌నుకున్న దీప త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని తీసుకుని ఊరు వ‌దిలి వెళ్లిపోతుంది. వార‌ణాసి ఆటోలో వెళ్తున్న దీప‌కు అత్త సౌంద‌ర్య క‌నిపిస్తుంది... పిల్ల‌లు నానమ్మా అంటారు.. క‌ల‌వాల‌ని దీప‌కు వున్నా వార‌ణాసికి ఆటో పోనివ్వ‌మ‌ని చెప్తుంది దీప. దీంతో ఆటో ముందుకు క‌దులుతుంది.

క‌ట్ చేస్తే.. దీప‌ గురించి ఆలోచిస్తూ కారులో వెళుతున్న కార్తీక్‌కి ఎదురుగా అంజి బైక్ పై వ‌స్తూ క‌నిపిస్తాడు. అంజిని పిలిచి కారెక్క‌రించుకుని మోని‌త ఇంటికి తీసుకెళ‌తాడు కార్తీక్‌. మోనిత ముందు "ఇప్ప‌డు నిజం చెప్ప‌రా" అని బెదిరించ‌డంతో అస‌లు నిజం మొత్తం చెప్పేస్తాడు అంజి. "నీకు మోనిత ఎలా తెలుసు? దీప‌కు ఏం చెప్పావ్‌? మా అమ్మ‌‌‌కు ఏం చెప్పాల‌నుకున్నావ్‌? అన్నీ బ‌య‌ట‌పెట్టేయ్" అని అంజిని నిల‌దీయ‌డంతో మోనిత చేయించిన హిమ హ‌త్య గురించి చెప్పేస్తాడు అంజి. అది విన్న‌ట్టే విని డాక్ట‌ర్ బాబు, "ఇలా దీప నీతో క‌థ‌లు చెప్పిస్తోందా?" అని షాకిస్తాడు. అది కాద‌ని అంజి ఎంత చెప్పినా ప‌ట్టించుకోకుండా బ‌య‌టికి నెట్టేస్తాడు.

అంజి చెప్పింది కార్తీక్‌ న‌మ్మ‌క‌పోవ‌డంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. క‌ప‌ట నాట‌కం ఆడుతూ కార్తీక్ గుండెల‌పై వాలి "ఇప్ప‌డు అర్థ‌మైందా నా వెనక ఎంత భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతోందో?".. అని క‌ప‌ట‌ప్రేమ‌ని ఒల‌క‌బోస్తూ వుంటుంది. ఈ యాక్టింగ్ కి క‌రిగిపోయిన కార్తీక్ "ఊరుకో మోనితా ఊరుకో" అని మోనిత‌ని ఓదారుస్తాడు. సోమ‌వారం ఈ ఎపిసోడ్ స్టార్ మాలో ప్ర‌సారం కానుంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు.