English | Telugu

Illu illalu pillalu : ప్రేమ చేసిన పనికి ధీరజ్ షాక్.. శ్రీవల్లికి వార్నింగ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -366 లో.....భాగ్యం ఆనందరావు దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. శ్రీవల్లి టెన్షన్ పడుతూ అమూల్య, విశ్వ ఉన్న ఫొటోస్ చూపిస్తుంది. ఇవెందుకు ఎక్కడ నుండి వచ్చాయని భాగ్యం అడుగుతుంది. ఆ విశ్వగాడు ఈ ఫొటోస్ ఇచ్చి.. ఇవి పెళ్లి వాళ్ళకి చూపించి ఎంగేజ్ మెంట్ ఆపాలని చెప్పాడని శ్రీవల్లి చెప్పగానే భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు.ఈ విషయం గానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని శ్రీవల్లి భయపడుతుంది.

దాంతో నువ్వేం టెన్షన్ పడకు.. ఈ పెళ్లి నేనే క్యాన్సిల్ చేపిస్తానని భాగ్యం అంటుంది. మరొకవైపు ప్రేమ ఒక పేపర్ పై D, p అని రాసి డోర్ కి పెడుతుంది. అది ధీరజ్ చూసి చింపేస్తాడు. మరొకవైపు రాత్రి విశ్వని శ్రీవల్లి తిడుతుంది. ఈ బండోడు నాతో అన్ని తప్పులు చేయిస్తున్నాడు.. ఇక ఏ తప్పు చెయ్యను.‌ ఇదొక్కటే లాస్ట్ అని శ్రీవల్లి అనుకుంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావని శ్రీవల్లిని ప్రేమ అడుగగా.. ఏం లేదని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే నర్మద వస్తుంది. నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావని అర్థమవుతుందని నర్మద అంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నువ్వు దాన్ని చెడగొట్టాలని ట్రై చేస్తే ఊరుకోమని శ్రీవల్లికి నర్మద, ప్రేమ వార్నింగ్ ఇస్తారు.

అ తర్వాత ధీరజ్ పడుకున్నాక ప్రేమ తన టీ షర్ట్ పై DP అని రాసి ఒక లవ్ సింబల్ వేసి ధీరజ్, ప్రేమ అని రాస్తుంది. ధీరజ్ ప్రొద్దున లేచి ఫోన్ మాట్లాడుతుంటే.. సాగర్ చూసి బాగుంది రా నాక్కూడా అలాంటిది కావాలని అంటాడు కానీ ధీరజ్ కి ఏం అర్థం కాదు. చందు వచ్చి ఒరేయ్ నువ్వు సూపర్ రా అని అంటాడు. నర్మద చూసి సూపర్ అంటుంది. తిరుపతి చూస్తాడు. చివరగా శ్రీవల్లి చూసి మీ ఆవిడపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా టీ షర్ట్ పై రాసుకోవాలా అని అంటుంది. అందరు వచ్చి బాగుందని అంటారు. ఏంటని టీ షర్ట్ విప్పి చూసుకొని ధీరజ్ షాక్ అవుతాడు. ఇదంతా ఆ తింగరిదాని పని అని ధీరజ్ అనుకుంటాడు. అప్పుడే వేదవతి ఎంట్రీ ఇచ్చి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఇలాగే ఉన్నారా అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.