Read more!

English | Telugu

Karthika Deepam 2 : ఆ స్కూల్ లో శౌర్యకి అడ్మిషన్ కన్ఫమ్.. ఆ ముగ్గురు చూసేసారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో..... శౌర్య, దీప ఇద్దరు సైకిల్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అప్పుడే పారిజాతం వస్తుంది. సైకిల్ గురించి శౌర్య పారిజాతానికి చెప్తుంది. ఆ సైకిల్ ఎవరిచ్చారో తెలుసా అని శౌర్యా అనగానే.. శౌర్య నువ్వు సైలెంట్ గా ఉండమని దీప అంటుంది. నువ్వు చెప్పు అని శౌర్యతో పారిజాతం అంటుంది. ఆ సైకిల్ కార్తీక్ ఇచ్చాడని శౌర్య అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది. మీ ఊరికి కార్తీక్ వచ్చాడా అని పారిజాతం అడుగుతుంది. అవును మా ఊళ్ళో పోటీలకు వచ్చి.. మా అమ్మ గెలిచినందుకు సైకిల్ బహుమతి ఇచ్చాడని శౌర్య చెప్తుంది. అంతకుముందు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చాడా అని పారిజాతం అనగానే.. దీప తనని తిట్టి పంపిస్తుంది.

ఆ తర్వాత బంటు పారిజాతం కోసం బయట వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే పారిజాతం సైకిల్ పై లిఫ్ట్ లో వస్తుంది. ఎందుకు ఇలా వచ్చారని పారిజాతాన్ని బంటు అడుగుతాడు. ఇప్పుడు టాపిక్ కూడా సైకిల్ గురించి కాబట్టి ఇలా వచ్చానని పారిజాతం అంటుంది. దీప గురించి తెలుసుకోవడానికి పంపిస్తే వెళ్ళలేదని తెలిసి బంటుని పారిజాతం తిడుతుంది. ఆ తర్వాత దీపకి కార్తీక్ కి ముందే పరిచయం ఉందని పారిజాతం చెప్తుంది. ఇక నువ్వు వెళ్లి దీప, కార్తీక్ లు ఇంక ఆ సైకిల్ గోల ఏంటో పూర్తిగా కనుక్కోమని పారిజాతం బంటుని పంపిస్తుంది.

మరుసటిరోజు శౌర్యని కార్తిక్ స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి వెళ్తాడు. అక్కడ కార్తిక్ ప్రిన్సిపల్ తో మాట్లాడుతాడు. టెస్ట్ ద్వారా శౌర్య ని స్కూల్ లో జాయిన్ చేసుకోండి అని అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ మేడమ్ ని పిలిచి శౌర్యకి టెస్ట్ కండక్ట్ చెయ్యమని చెప్తాడు. ఆ మేడమ్ కార్తీక్ ని చూసి జ్యోత్స్న బావ కదా తనకి చెపుదామని జ్యోత్స్న కి ఫోన్ చేస్తుంది. ఒక పాపతో మీ బావ ఇక్కడకి వచ్చాడని చెప్పగానే జ్యోత్స్న షాకై..  పారిజాతం దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్తుంది. ఇద్దరు స్కూల్ కి బయలుదేరుతారు. మరొకవైపు నర్సింహా టాక్సీ నడుపుతూ స్కూల్ కి వచ్చి.. అక్కడ శౌర్య కార్తీక్ ని చూసి లోపలికి వెళ్తాడు. అటెండర్ తో మాట్లాడి అతను ఎందుకు వచ్చాడో కనుక్కోమని చెప్తాడు. శౌర్యకి అడ్మిషన్ ఒకే కావడంతో శౌర్య థాంక్స్ అంటూ కార్తీక్ దగ్గరికి వస్తుంది. అలా రావడం జ్యోత్స్న పారిజాతం, నర్సింహా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.