English | Telugu

అతన్ని చూస్తుంటే నా బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు

సుమ అడ్డా షో రాబోయే వారం చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఒక యాంకర్ సుమకి తోడుగా మరో నలుగురు యాంకర్స్ వచ్చారు. యాంకర్స్ స్పెషల్ థీమ్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. యాంకర్స్ గా వింధ్య విశాఖ, గాయత్రీ భార్గవి, శిల్ప చక్రవర్తి, గీత ఎంట్రీ ఇచ్చారు. "ఈరోజు నాకు కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసారు" అంటూ సుమ అనేసరికి "సుమ గారికి సుమ గారే సాటి ఏసుకోండి ఒక ఓ" అంటూ శిల్ప చక్రవర్తి మంచి జోష్ తో డైలాగ్ చెప్పింది. ఇక వింధ్య విశాఖ, గీతను చూసిన సుమ "ఈమధ్య మీరు ముంబై యాంకర్స్ ఇపోయారు కదా" అనేసరికి "ఇక్కడ మీరు ఏ స్లాట్ ఇవ్వట్లేదు కదా అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది" అని చెప్పింది వింధ్య విశాఖ.

ఇక తర్వాత "పూర్వ యాంకర్ల సమ్మేళనం 1980 -2080 " అనే కాన్సెప్ట్ తో ఒక టాస్క్ ఇచ్చింది. యాంకర్స్ వాళ్ళ వాళ్ళ షోస్ కి ఎలా యాంకరింగ్ చేసేవారో చూపించారు. ఇక ఆడియన్స్ గా వచ్చిన కొంతమంది జెంట్ స్టూడెంట్స్ ని స్టేజి మీదకు తీసుకొచ్చింది. వాళ్ళతో 50 పుషప్స్ తీసినవాడే మగాడంటూ సుమ చెప్పేసరికి ఒక కుర్రాడు నిజంగానే పుషప్స్ తీసాడు. ఆ కుర్రాడిని చూసేసరికి శిల్ప చక్రవర్తికి తన బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడంటూ చెప్పింది. "పెళ్ళైతే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు..ఇంకా నీకు బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటా" అని సుమ గట్టిగా కౌంటర్ వేసేసరికి "ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు" అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది శిల్ప. ఇలా ఈ వారం ఈ షో ఎంటర్టైన్ చేయబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.