English | Telugu

Karthika Deepam 2: దీప కండిషన్ అదే.. ఆ పూజ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -186 లో.... దీపని తీసుకొని కార్తీక్ గదిలోకి వస్తుంది శౌర్య. నాతో ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అంటాడు. మాట్లాడడానికి కాదు నాన్న ఇక్కడే పడుకోవడానికి అని శౌర్య అంటుంది. ఇబ్బందిగానే దీప పడుకుంటుంది. వాళ్ళ ఇద్దరిలో మధ్యలో శౌర్య పడుకుంటుంది. నాన్న నాకు కథ చెప్పు అనగానే.. దీప స్టోరీనీ చెప్తుంటాడు కార్తీక్. శౌర్య పడుకున్నాక దీప గదిలో నుండి వెళ్ళిపోతుంది.

దీపని చూసిన అనసూయ.. శౌర్య కోసం, నా కోసం.. నువ్వు అక్కడికి వెళ్ళావ్.. ఇష్టం లేదు కదా అని అంటుంది. కాంచన అమ్మ మీ ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటుందని అనసూయ అనగానే.. వద్దని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు దీప గుడికి వెళ్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతుంది. మరొకవైపు సుమిత్ర అదే గుడికి వెళ్తుంది. జ్యోత్స్న పేరున అర్చన చేయిస్తుంది. సుమిత్రకి ఒక పండుని ప్రసాదంలాగా ఇస్తాడు పూజారి. అది పట్టుకొని వెళ్తుంటే కిందపడిపోయి దీప దగ్గరికి వస్తుంది. దీపని సుమిత్ర చూస్తుంది. సుమిత్ర దీపతో బానే మాట్లాడుతుంది. జరిగింది.. జరిగిపోయింది దాన్ని ఎవరు మార్చలేరని అంటుంది. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లనిపిస్తుంది. కార్తీక్ ని భర్త గా ఒప్పుకోలేదా అని అడుగుతుంది. ఇష్టం లేకుండా జరిగింది నా కూతురికి నాన్న అవ్వాలని అలా చేసాడు కానీ నాకు భర్త అవ్వాలని కాదని దీప అంటుంది.

పెళ్లి అయింది.. దీన్ని ఎవరు మార్చలేరు.. ఇది నా కూతురు కోసం పూజారి ఇచ్చిన ప్రసాదం.. ఇది ఇప్పుడు నీకు అవసరం అయ్యేలా ఉందని సుమిత్ర తనకి ఇచ్చి వెళ్తుంది. పూజ ఎలా ఆపాలి.. వాళ్ళంతట వాళ్లే ఆపేలా చెయ్యాలని దీప అనుకుంటుంది. తరువాయి భాగంలో పూజ తర్వాత మమ్మల్ని ఇద్దరు ఆశీర్వాదించాలి కానీ మీరు ఒక్కరే ఉన్నారు.. శ్రీధర్ గారిని కూడా రమ్మని చెప్పాలి.. అప్పుడే ఈ పూజ జరుగుతుందని దీప కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.