English | Telugu
Karthika Deepam 2 : దీప కోసం కార్తిక్.. ఇరువురు ప్రయాణంలో ఏకమయ్యేనా!
Updated : Apr 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఇది నవ వసంతం. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -7లో..దీప ఇంటికి అప్పు ఇచ్చిన వ్యక్తి వస్తాడు. అతనితో పాటుగా కొంతమంది పెద్ద మనుషులని తీసుకొని వస్తాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళు కొట్టారు.. ఒక మనిషికి చెప్పి కొట్టించారని పెద్ద మనుషులతో దీపకి అప్పిచ్చిన ఆ పెద్ద మనిషి చెప్తాడు. దాంతో అతను అబద్ధం చెప్తున్నాడని దీప చెప్తుంది.
ఆ తర్వాత అప్పు చెల్లించండి అని వాళ్ళు అడగగా.. నన్నడిగి వాడు అప్పు ఇవ్వలేదు. నేనెందుకు కట్టాలని కుబేరుడి అక్క అనసూయ అంటుంది. అప్పుడే అందులో ఒకతను నరసింహ హైదరాబాద్ లో ఉన్నాడంట అనగానే.. నేను వెళ్లి తీసుకొని వస్తాను అప్పు కడతానని దీప చెప్తుంది. ఒక్క దానివేం వెళ్తావ్ నేను వస్తానని అనసూయ అంటుంది. అందరు వెళ్లి అక్కడుంటే నా అప్పు పరిస్థితి ఏంటి ఈ ఇల్లు నా పేరు మీద రాసి వెళ్ళండి అని అప్పిచ్చినతను అనగానే.. ఈ ఇల్లు నాది నేను ఎక్కడికి వెళ్ళను.. తనే వెళ్తుంది నా కొడుకుని తీసుకొని వస్తుందని అనసూయ అంటుంది. మరొకవైపు కార్తీక్ సైట్ కు సంబంధించిన ప్లాన్ ని వివరిస్తాడు. ఆ తర్వాత దీపకి ఒకతను కన్పించి.. సైకిల్ పోటీలో నీకు సైకిల్ బాహుమతిచ్చిన అతను నీ అడ్రెస్ అడిగాడని చెప్తాడు. ఆ అప్పిచ్చిన అతను కూడా తనని కొట్టాడని చెప్పాడు. నాకోసం తనని కొట్టాల్సిన అవసరం ఏంటని దీప అనుకుంటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తిక్ వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటాడు. నేను చేసిన తప్పుకి క్షమించమని అడగాలంటు దీప దగ్గరికి కార్తిక్ బయలుదేర్తాడు.
మరొకవైపు దీప హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలు సర్దుతుంటే.. శౌర్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. నాన్న దగ్గరికి అని దీప సమాధానం చెప్తుంది. నువ్వు కనుక నా తమ్ముడి జీవితంలోకి రాకుంటే వాడు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉండేవాడని దీప వంక అనసూయ కోపంగా చూస్తుంది. ఆ తర్వాత దీప ఇంటికి కార్తిక్ వచ్చేసరికి తాళం వేసి ఉంటుంది. దాంతో కార్తిక్ డిస్సపాయింట్ అవుతాడు. అప్పుడే కార్తీక్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఇంటికి వస్తున్నావా అని అడుగుతాడు. వస్తున్నానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.