English | Telugu

వాళ్ళకి పెళ్ళి జరిగి ఆరేళ్ళైంది.. శౌర్య వాళ్ళ కూతురే!

ఊహించని ట్విస్ట్ లతో తెలుగు సీరియల్స్ సాగుతున్నాయి. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో కార్తీకదీపం-2 కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీక్, దీప ఇద్దరు కలుస్తారా లేదా అన్న క్యూరియాసిటితో మొదలైన రెండవ భాగం ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

జ్యోత్స్న చేసిన తప్పుని పోలీసులు ఇంటికి వచ్చి అడిగినప్పుడు తెలియక దీప సమాధానం చెప్పడంతో తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడి నుండి కథ పూర్తిగా మారింది. అప్పటిదాకా సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న అందరు కలిసి దీప, శౌర్యలని బాగా చూసుకోగా.. ఎప్పుడైతే జ్యోత్స్న స్టేషను కి వెళ్ళిందో అక్కడి నుండి దీపని నెగెటివ్ గా చూస్తున్నారు‌. దీనికి తోడు పారిజాతం కల్పించి చెప్పే మాటలకి జ్యోత్స్న మైండ్ మొత్తం దీప మీద నెగెటివ్ నింపుకుంది. మరోవైపు దీప కష్టాలు దీపవి.. అటు నరసింహా రెండో పెళ్ళి చేసుకున్నాడని తన అత్త అనసూయకి చెప్పగా.. తను రెండో కోడలి ఆస్తికి ఆశపడి వారితో కలిసిపోవడంతో తను ఒంటరిగా మిగిలింది. ఇక ఒంటరిగా బాధపడుతుంటే కడియం కూడా అంతే బాధలో ఉండటంతో.. తనకి సాయం చేయడానికి ముందుకొచ్చింది దీప.

నేటి ప్రోమోలో శౌర్యని స్కూల్ లో జాయిన్ చేయడానికి కార్తిక్ తనని తీసుకెళ్తుంటే దీప చూసి ఆపుతుంది. ఏమైంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు అని దీప అనగా.. స్కూల్ లో జాయిన్ చూపించడానికి అని కార్తిక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న , పారిజాతం మాట్లాడుకుంటారు. " నాకలా కనపడటం లేదుగా" అని పారిజాతం అనగా.. మరి ఇంకెలా కన్పిస్తుందని జ్యోత్స్న అడుగుతుంది. "వాళ్ళిద్దరికి పెళ్ళి అయి ఆరేళ్ళు అయినట్టు.. శౌర్యేమో వాళ్ళిద్దరికి కూతురు అయినట్టు.. అది జాలి కాదు భాద్యత అంటే నీకు అర్థమవ్వట్లేదా" అని పారిజాతం అంటుంది. మరోవైపు నా మీద గానీ నా బిడ్డ మీద గానీ జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు బాబు అని కార్తిక్ తో దీప అంటుంది‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.