English | Telugu

రెండు వందల ఎపిసోడ్ లు పూర్తిచేసుకున్న కార్తీకదీపం-2.. 

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో చెప్పలేం.. ఏ మూవీకి లేనంత ఫాలోయింగ్ ఈ సీరియల్ కి ఉంది. కార్తీకదీపం మొదటి పార్ట్ విజవంతంగా పూర్తి అవ్వడంతో దర్శకుడు నవవసంతం అంటు కార్తీకదీపం-2 ని తీసుకొచ్చాడు.

ఇక ఈ సీరియల్ తాజాగా రెండొందలు(200) ఎపిసోడ్ కి చేరుకుంది. ఇక ఇందులోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. బుల్లితెర శోభన్ బాబు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. కార్తీక దీపం-2 కథ ఇప్పటికే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కార్తీక్ దీపని శౌర్య కోసం పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాములుగా లేవు టీవీలో పెళ్లి చేసుకుంటే.. టీవీ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. మరికొందరు అయితే హారతులు కూడా పట్టారు. ఈ వీడియోలని సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళకి పిచ్చి పీక్స్ కు పోయిందనిపిస్తుంది.‌ మరి ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. కార్తీక్ , దీప ఇద్దరు ఒకటయ్యారు. ఇక సీరియల్ మెయిన్ విలన్ జ్యోత్స్న ఎలాగైనా కార్తీక్ ని దక్కించుకోవాలని పారిజాతంతో కలిసి విశ్వప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతుంది.

మరొకవైపు సుమిత్ర, దశరథ్ ల అసలైన వారసురాలు దీప అనే విషయం దాస్ కనిపెడతాడో లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాస్ కూతురు జ్యోత్స్న.. ఆ విషయం పారిజాతం, జ్యోత్స్న, దాస్ లకి తెలుసు కానీ దీప అసలైన వారసురాలనే విషయం మాత్రం సస్పెన్సు. దీప దగ్గర ఉన్న కుబేర్ ఫోటోని దాస్ చూసినప్పుడే ఈ నిజం బయటకొస్తుంది‌. కానీ దీనిని
మనకి ఏ వెయ్యో ఎపిసోడ్ లోనో రెండువేల ఎపిసోడ్ ల తర్వాతనో రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఎందుకంటే ఈ సీరియల్ లో‌ ఇదే కీలకం. దీపే అసలైన వారసులు అని తెలిసాక శివన్నారాయణ‌, దశరథ్, సుమిత్ర అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇది ఇప్పట్లో రాదు కాబట్టి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.