English | Telugu
తెలుగు కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసిన కన్నడ బ్యాచ్..
Updated : Nov 12, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో పదకొండో వారం కన్నడ బ్యాచ్ నామినేషన్ల గురించి మాట్లాడుకున్న వీడియోలు ఒక్కొక్కటిగా నెట్టింట బయటకొస్తున్నాయి. వారి మాటలు సోషల్ మీడియాలోని నెటిజన్లంతా మండిపడుతున్నారు. ఈ వారం పృథ్వీ, యష్మీలని డేంజర్ జోన్ లో ఉంచి ఎవరినో ఒకరిని బయటకు పంపాలని చూస్తున్నారు నెటిజన్లు.
ఎందుకంటే ఈ పృథ్వీ, యష్మీ, ప్రేరణ, నిఖిల్ కలిసి నామినేషన్ల ముందు ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో మాట్లాడేస్తూ దొరికిపోయారు. ఇక ప్రతీవారం తెలుగు కంటెస్టెంట్స్ బయకు వచ్చేస్తున్నారు. హరితేజ, గంగవ్వ, నయని పావని, మెహబూబ్, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, అభయ్ నవీన్, శేఖర్ బాషా, బెజవాడ బేబక్క వీళ్లంతా తెలుగువాళ్లే. అయితే కన్నడ బ్యాచ్ లోని యష్మీ, పృథ్వీ ఓటింగ్ లో ప్రతీవారం లీస్ట్ లో ఉన్నా వారిని మాత్రం బయటకు పంపించడం లేదు.
వాళ్ళంతా ఫౌల్ గేమ్ ఆడినా.. పచ్చి అబద్దాలు ఆడినా.. గ్రూప్ గేమ్ ఆడినా.. హౌస్‌లో ఎన్ని వెధవ వేషాలు వేసినా.. ఎన్ని ఫ్లిప్‌లు చేసినా కూడా.. వీకెండ్ లో వాళ్ళనే పొగిడేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే కన్నడ వాళ్ళంతా గ్రూప్ కట్టి.. 12 మంది తెలుగు వాళ్లని హౌస్ నుంచి బయటకు పంపించేశారుమ ఇది ఇలానే సాగితే టాప్-5 మొత్తం వారే ఉంటారు. ఇక నిఖిల్ కి పోటీ నబీల్ కాబట్టి అతడినే టార్గెట్ చేశాడు నిఖిల్. అతన్ని ఫినాలేకి వెళ్లకుండా చేయడానికి తన కన్నడ బ్యాచ్‌తో కలిసి స్కెచ్ వేశాడు నిఖిల్. పదోవారం ఎలిమినేషన్‌లో గంగవ్వ, హరితేజలను ఎలిమినేట్ చేశారు. ఇక పదకొండవ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అంతా కలిసి గ్రూప్ నామినేషన్స్ చేశారు. నబీల్ టైటిల్ రేస్‌లో ఉన్నాడని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా తెలుసుకున్నాడు. నిఖిల్ కి బాగా దగ్గరైన హరితేజ.. నబీల్ టైటిల్ రేస్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పేసినట్టుంది. దాంతో ఎలాగైనా నబీల్‌ని హౌస్ నుంచి బయటకు పంపాలని అతన్ని ఫినాలేకి రాకుండా చేయాలని తన కన్నడ బ్యాచ్‌తో కలిసి కుట్ర చేస్తున్నాడు నబీల్.
ఇప్పటికే నబీల్ కి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది. మనం అలర్ట్‌గా లేకపోతే ఫినాలేకి వెళ్లిపోతాడు. కాబట్టి అతను ఫినాలేకి వెళ్లకుండా ఉండాలంటే.. మనమంతా కలిసి గ్రూప్‌గా అతన్ని నామినేట్ చేస్తుండాలి. లేదంటే అతను ఫినాలేకి వచ్చేస్తాడు అంటూ 'కే' బ్యాచ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలాగే సాగిపోతూ నమ్మకంతో ఓట్లు వేసే అభిమానులని బిగ్ బాస్ మోసం చేసినట్టే అవుతుంది. ఈ వారమైన కన్నడ బ్యాచ్ లోని పృథ్వీ, యష్మీలలో నుండి ఎవరినో ఒకరిని బయటకి పంపిస్తారో లేదో చూడాలి మరి.