English | Telugu

ఇంటిపత్రాల కోసం సేట్ ని కొట్టిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -128 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టిఫిన్ చేస్తుంటారు. అప్పుడే స్వప్న వచ్చి టిఫిన్ చేసేటప్పుడు నన్ను పిలవాలని తెలియదా అని అంటుంది. ఇక్కడ ఎవరు ఎవరిని పిలువరు. అందరు ఈ టైమ్ కి రావాలి. నిన్ను పిలవాలని నువ్వు అనుకుంటే మీ అత్తయ్యని, మీ ఆయన్ని పిలవమని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత స్వప్నకి ఇడ్లి పెడుతుంది కావ్య. ఏంటీ ఇన్ని క్యాలరీస్ ఉన్న ఇడ్లీ తింటే బాడీ ఎలా ఉంటుంది. మీలా ఏజ్ కన్న పెద్దగా కనిపిస్తారని స్వప్న అంటుంది. అలా ప్రతీసారీ స్వప్న తన బిహేవియర్ తో చిరాకు తెప్పిస్తుంది. మరొకవైపు మీనాక్షి ఇంటిపత్రాలు తీసుకోవడానికి సేట్ ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఏంటి డబ్బులు కడుతానని చెప్పి తీసుకొచ్చారు. డబ్బులు కట్టి మీ ఇంటిపత్రాలు తీసుకొండి అని సేట్ అంటాడు. సేటు డబ్బులు లేవు. త్వరలోనే మీ డబ్బు వడ్డీతో సహ కట్టేస్తానని కనకం సేటుని బ్రతిమిలాడుకుంటుంది.

అయిన సేటు వినకపోవడంతో బెదిరించి ఒక కర్రతో సేటు తలపై కొడుతుంది కనకం. సేటు కిందపడిపోతాడు. ఏంటీ ఇలా అయింది. మా ఆయన వచ్చే టైమ్ అయిందని కనకం మీనాక్షి ఇద్దరు సేట్ ని ఒక గదిలో కట్టి ఉంచుతారు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో ఉండి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటుంది. స్వప్న బయట కూర్చొని ఉంటుంది. అడిగింది ఇవ్వడానికి పనివాళ్ళు, బోర్ కొట్టినప్పుడు బయటకు వెళ్లడనికి కార్. ఇది కదా నేను కోరుకున్నదని స్వప్న అనుకుంటుంది. అప్పుడే పనిమనిషి చెట్లకు నీళ్లు పోస్తుంటే అక్కడే ఉన్న స్వప్నపై వాటర్ పడుతుంది. అది చూసి పనిమనిషిని తిడుతుంది స్వప్న. అప్పుడే కావ్య వచ్చి అలా మాట్లాడవద్దు. పని వాళ్లకి కూడా గౌరవం ఇవ్వాలని కావ్య చెప్తుంది. కావ్య ఎంత చెప్పిన వినకుండా పొగరుగా మాట్లాడి స్వప్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా పై నుండి రాజ్ చూస్తుంటాడు. స్వప్న అలా తిట్టడం రాజ్ చూసేస్తాడు. అలా రాజ్ చూస్తుండగా కావ్య తనని చూస్తుంది. రాజ్ కి ఎప్పుడు నిజం తెలిసిపోతుందో అనే భయం నాకు వద్దు..తనకి నిజం చెప్పాలనుకుంటుంది.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. రాజ్ కోపంగా చూస్తుంటే నిజం తెలిసిపోయినేదేమో అని కావ్య భయపడుతుంది. మీ అక్క గురించి నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ అంటాడు. నిజం తెలిసిందని కావ్య ఇంకా టెన్షన్ పడుతుంది. మీ అక్క ఇలా పొగరుగా బిహేవ్ చేస్తుందని నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ అంటాడు. మా అక్క ప్రవర్తన గురించి అంటున్నాడా.. ఇంకా నిజం తెలిసిపోయిందేమోనని అనుకున్నానని కావ్య అనుకుంటుంది. చిన్నప్పటి నుండి మా అక్క అంతే అని కావ్య అంటుంది. మరొక వైపు సేటు అరిస్తే బయటకు వినిపించకుండా ఉండటానికి కనకం, మీనాక్షి కలిసి సేట్ నోటికి ప్లాస్టర్ వేస్తారు. కాసేపటికి కృష్ణమూర్తి ఇంటికి రావడంతో సేటు దగ్గర నుండి మీనాక్షి, కనకం ఇద్దరు కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి కంగారుపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.