English | Telugu

ప్రదీప్ పెళ్లిపై చిన్నారుల కామెంట్స్...కన్నీళ్లు పెట్టుకున్న బాబూమోహన్

డ్రామా జూనియర్స్ సీజన్ 6 లో చిన్నారుల స్కిట్స్ ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా ఉన్నాయి. రోల్ నంబర్ 11 లో ఏడేళ్ల ఆదిత్య, తొమ్మిదేళ్ల జస్వంత్ వర్మ ఇద్దరూ వచ్చి స్కిట్ పెర్ఫామ్ చేశారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరి కంబినేషన్ లో ఎన్నో హిట్ మూవీస్ వచ్చాయి. అలా వాళ్ళ ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ ఈ చిన్నారులు బాగా పండించారు. అంతేకాదు. ప్రదీప్ పెళ్లి మీద కూడా కామెంట్స్ చేశారు. "నేను ఇలా అన్నానని కాదు. నీకు పెళ్ళికావట్లేదని ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించకు బుచికిబుచికి ..ఎందుకంటే అది ఇప్పట్లో అవ్వదులే " అనేసరికి ప్రదీప్, బాబు మోహన్ నవ్వేశారు. "ఇప్పుడు అవన్నీ ఎందుకు లెండి సర్" అన్నాడు సరదాగా నవ్వుతూ.

సోషల్ మీడియా టూ అప్ డేట్ గా మారిపోయి బతికి ఉన్నవాళ్లను చంపేస్తూ ఆ వార్తలను రకరకాల థంబ్ నెయిల్స్ తో పోస్ట్ చేస్తూ వాళ్ళను బాధపెడుతున్న విషయాన్ని ఈ స్కిట్ లో హైలైట్ చేశారు..కొంతకాలం క్రితం కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ ఒక న్యూస్ హల్చల్ చేసింది. "అప్పుడు నీకు గుర్తుందా అన్నా నువ్వు లేవంటూ వచ్చిన వార్తను చూసేసరికి తట్టుకోలేక నేను నీకు ఫోన్ చేసాను..నువ్ నా కాల్ లిఫ్ట్ చేసి హలో అనేవరకు నా గుండె వేగం తగ్గలేదన్న..దేవుడిని మనకన్నా మన పిల్లలే బాగా నచ్చి వాళ్ళను ముందే తీసుకెళ్లిపోయాడు..విలువల్లేని వార్తల వల్ల మీరెంత ఆనందపడతారో మాకు తెలీదు కానీ నలుగురిని నవ్విస్తూ బతికే మేము మాత్రం చాలా బాధపడతాం" అంటూ అందరినీ కన్నీళ్లు పెట్టించారు ఈ చిన్నారులు. ఇక బాబుమోహన్ కూడా తమ మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పారు " మా ఇద్దరి కంబినేషన్ బొబ్బిలి రాజా నుంచి స్టార్ట్ అయ్యింది. మామగారు మూవీ వచ్చేసరికి చాల టాప్ కి వెళ్లిపోయాం. మా జంటతో ఎన్నో చిన్న సినిమాలు ఆడాయి..అసలు నాకు ఒకే ప్లేట్ లో ముద్దలు కలిపి పెట్టడమేంటి కోటగారు ..కోటన్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు బాబు మోహన్ సొంత తమ్ముడు అని చెప్పుకుంటారు . కోట గారి గురించి ఇలా ఎవరో టీవీలో వేశారు అది చాలా బాధాకరం..ఆయనకు ఆయన నేను బతికే ఉన్నాను అని చెప్పుకునే దుస్థితి వచ్చింది. అది ఎంత దౌర్భాగ్యం" అంటూ బాధపడ్డారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.