English | Telugu
కామెడీ స్టార్స్ ధమాకాలో కెఏ పాల్ వర్సెస్ వర్మ
Updated : Jun 1, 2022
హాస్య ప్రియుల్నికడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధమాకా`. గత కొన్ని నెలలుగా స్టార్ మాలో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అవుతున్నఈ షో మంచి ఆదరణ పొందుతూ రేటింగ్ పరంగానూ దూసుకుపోతోంది. ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ వీజే న్యాయ నిర్ణేతలుగా, ఇక యాంకర్ గా దీపిక పిల్లి వ్యవహరిస్తున్నారు. టీమ్ లీడర్లుగా ముక్కు అవినాష్, హరి, అదిరే అభి, ధన్ రాజ్, టిల్లు వేణు, అప్పారావు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఆదివారం జూన్ 5న ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో అప్పారావు, అదిరే అభి, సత్య, ధన్ రాజ్, టిల్లు వేణు, హరి, యాదమ్మరాజులు కామెడీ స్కిట్ లతో అదరగొట్టేశారు. అయితే ఈ అందరి కంటే ముక్కు అవినాష్ చేసిన `కెఏ పాల్ వర్సెస్ వర్మ స్కిట్ ఓ రేంజ్ ఓ పేలినట్టుగా తెలుస్తోంది. హరి డైరెక్టర్ గా యాదమ్మ రాజు హీరోగా చేసిన స్కిట్ కూడా నవ్వులు పూయించింది. ఇక ధన్ రాజ్, టిల్లు వేణు కలిసి చేసిన స్కిట్ కూడా ఆకట్టుకుంది.
అయితే ముక్కు అవినాష్ చేసిన కెఏ పాల్ వర్సెస్ వర్మ స్కిట్ షోకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. వర్మ డైరెక్టర్ గా కేఎ పాల్ హీరోగా సినిమా చేస్తే ఎలా వుంటుందని ముక్కు అవినాష్ స్కిట్ చేశాడు. 'ఈ మధ్య డేంజరస్ అనే సినిమా తీశాను చూశావా?' అని ముక్కు అవినాష్ అడిగితే కేఏ పాల్ పాత్రలో కనిపించిన జబర్దస్త్ రాము `నువ్వు తీసిన సినిమాలే డేంజరస్ ఇంకా చూట్టమేంటీ?.. నేనే కాదు నువ్వు కూడా చూడవు' అంటూ పంచ్ వేశాడు.
ఆ తర్వాత, `మొన్నటికి మొన్న రాజమౌళి గారు ఫోన్ చేశారు. సర్ `ట్రిపుల్ ఆర్` తరువాత ఫోర్ ఆర్ తీస్తున్నా అన్నారు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పా.. ఫోర్ ఆర్ తీస్తే మాత్రం రష్యా ప్రధాన మంత్రి, చైనా ప్రధాన మంత్రి, ఉత్తర కొరియా ప్రధాన మంత్రిని పెట్టండి నేను కూడా చేస్తా అని చెప్పా` అనగానే 'నాలుగు రాడ్లు' అని అవినాష్ అనడం.. 'మీరు కూడా చేయండి, అప్పడు ఐదు రాడ్లు' అని మరో వ్యక్తి అనడం నవ్వులు పూయిస్తోంది.