English | Telugu
నాగ్ కంటే తారక్‌కు బెటర్ రేటింగ్!
Updated : Sep 4, 2021
జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి బుల్లితెరపై హోస్ట్‌గా కనిపిస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 1కు హోస్ట్‌గా వ్యవహరించడం ద్వారా తారక్ టెలివిజన్ తెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన హోస్ట్‌గా చేయడంతో 'బిగ్ బాస్' ప్రారంభ సీజన్ సూపర్ హిట్టయింది. ఇప్పుడు రెండోసారి 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో ద్వారా ఆయన టీవీ తెరపై ప్రత్యక్షమవుతున్నారు. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చారు.
'ఆర్ఆర్ఆర్' కో-స్టార్స్ ఇలా హోస్ట్ అండ్ కంటెస్టెంట్‌గా దర్శనమివ్వడంతో ఇద్దరి ఫ్యాన్స్‌తో పాటు వ్యూయర్స్‌కు కూడా కన్నుల పండగగా మారింది. లేటెస్ట్‌గా ఈ షో రేటింగ్స్ వచ్చాయి. కర్టెన్ రైజర్ వీక్షకులకు అమితంగా ఆకట్టుకుందని దానికి లభించిన 11.4 టీఆర్పీ తెలియజేసింది. గతంలో 2014లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్‌కు 9.7 టీఆర్పీ వచ్చింది. అంటే ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు తారక్ ఇచ్చిన ఓపెనింగ్ అదిరిందన్న మాటే.
జూనియర్ ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా పనిచేయడంతో జెమిని టీవీ ఓవరాల్ రేటింగ్ కూడా ఒక్కసారిగా 290 జీబీఆర్ నుంచి 400 జీబీఆర్‌కు పెరిగింది. దీంతో నిర్వాహకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రానున్న రోజుల్లో 'ఎవరు మీలో కోటీశ్వరుడు'కు వీక్షకాదరణ మరింతగా పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు.