English | Telugu
షన్ను - సిరిలకు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్
Updated : Dec 12, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 క్లైమాక్స్‌కి చేరింది. వచ్చే వారం ఫైనల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జరిగిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గత కొన్ని వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, షన్నుల ట్రాక్ ఆడియన్స్‌కి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరి, షన్నులకి ఎక్స్ హౌస్ మేట్ జెస్సీ షాకిచ్చాడు. ఆదివారం ఇంటి సభ్యులతో ఒకరితో ఒకరిని అనుకరించే టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ సందర్భంగా కాజల్ ని అనుకరించిన శ్రీరామ్ నవ్వులు పూయించాడు.
ఆత తరువాత సిరిని సన్నీ అనుకరించిన నవ్వులు కురిపించాడు. ఇక షన్నుని కాజల్ అనుకరించి అదే స్థాయిలో నవ్వించింది. షన్ను.. సన్నీని అనుకరించారు. అయితే ఈ అనుకరణ సందర్భంగా సోడా వేస్తున్నావుగా అని షన్నుపై పంచ్ లేయడం నవ్వించింది. అయితే షన్ను ... సన్నీని అనుకరిస్తూ తనికి తానే గ్రేట్ అనుకుంటుంటే నాగ్ .. షన్ను ఎలా గ్రేట్ ప్రతీ దానికీ అలిగి కూర్చుంటాడంటూ గాలితీసేయడంతో ఇంటి సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు.
ఇదిలా వుంటే ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని ప్రశ్నిస్తారంటూ కొన్ని వీడియోలని ప్లేచేశారు నాగార్జున. ఇందులో జెస్సీ... షన్ను, సిరిలకు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం షాకిచ్చింది. `షన్ను చాలా సిరీయస్‌గా అడుగుతున్నాను..నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ వుందో... వేరే జనాలు ఏమనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? అని షాకిచ్చాడు... ఆ తరువాత సిరిని కూడా అదే స్థాయిలో నిలదీయడం గమనార్హం. బిగ్బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వచ్చావు కదా సిరి .. కానీ అది పక్కన పెట్టి ఎమోషనల్ కలెక్షన్ అయిపోతున్నాను. ఇది.. అది.. కనెక్ట్ అయిపోతున్నాను అంటున్నావ్ .. ఇది నీకు అవసరమా? అని క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. జెస్సీ మాట్లాడిన తీరు షన్ను ని పోటీలో సిరి వెనక్కి లాగేసిందని స్ఫష్టమవుతోంది.