English | Telugu

చీర కట్టుకెళ్తే ఆ లారీ డ్రైవర్ అల్లరి చేసాడు..అప్పుడు నేను మగవాడిలా వేషం మార్చుకున్నా


ఈ వారం ఢీ షో మంచి ఎమోషనల్ గా సాగింది. నెల్లూరి నెరజాణలు వెర్సెస్ ఓరుగల్లు వీరులు ఇద్దరూ ఈ వారం పోటీ పడ్డారు. కానీ నెల్లూరి నెరజాణలు మాత్రం మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ టచ్ ఇచ్చే ఒక సాంగ్ చేశారు. వీళ్ళు తమిళనాడులోని పేచీయమ్మాళ్ అనే ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయ్యాక ఒరిజినల్ పేచీయమ్మాళ్ ని స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఆమె లైఫ్ లో ఎదుర్కున్న ఎన్నో కష్టాలను తన మాటల్లో చెప్పారు. " నా పేరు పేచీయమ్మాళ్. నాకు 20 ఏళ్లకే పెళ్లి చేశారు. 15 రోజులకే నా భర్తే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అప్పటికే నేను గర్భవతిని. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాను...ఆ టైములో తింటానికి తిండి లేక పెయింటింగ్ పనులకు వెళ్లేదాన్ని. కూతురిని ఎలా పెంచాలో తెలీక ఇబ్బందులు పడ్డాను. ఒక హోటల్ లో పనికి వెళ్లడం మొదలుపెట్టాక నా పేరును ముత్తుగా మార్చేసుకున్నాను. నా ఆధార్ కార్డు, రేషన్ కార్డులో కూడా పురుషుడు అనే ఉంటుంది.

మా ఊరి పక్కన తూత్తుకుడి అనే ఊరు ఉంది. అక్కడికి పనికి వెళ్లేదాన్ని. అక్కడ మూడు షిఫ్తుల్లో పని చేయాల్సి వచ్చేది. అలా నైట్ షిఫ్ట్ కి వెళ్ళేటప్పుడు ఒక లారీ డ్రైవర్ అడ్డుపడి నన్ను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు అటుగా వచ్చిన ఒక అతను కాపాడాడు. చీర కట్టుకుని వెళ్తే మనల్ని మనం కాపాడుకోలేము అని తిరుచందూర్ కి వెళ్లి డ్రెస్ మార్చుకుని గుండు కొట్టించుకుని రుద్రాక్ష వేసుకున్నా . అలా మగవాడిలా వేషం మార్చుకుని పనికి వెళ్లేదాన్ని. నాలుగు నెలల తర్వాత అలా వెళ్తుండగా అదే లారీ డ్రైవర్ ని లిఫ్ట్ అడిగాను. వెళ్ళు, నడవలేవా, కాళ్ళు ఉన్నాయిగా అన్నాడు. అప్పుడు అనుకున్నా ఈ డ్రెస్ మనల్ని కాపాడుతుంది అని.. అలాగే నా కూతురిని పెంచాను." అని చెప్పారు పేచీయమ్మాళ్. తర్వాత పృద్వి స్టేజి మీదకు వచ్చి "మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదమ్మా" అని అడిగేసరికి " మా ఆయన తాకిన ఈ శరీరాన్ని ఇంకెవరూ తాకకూడదు అనుకున్నా..అందుకే పెళ్లి చేసుకోలేదు" అని చెప్పారు. "ఇప్పుడు నన్ను మగవాళ్ళతో సమానంగానే పనికి పిలుస్తారు..నేను వెళ్తాను. నా చివరి క్షణం వరకు ఇలాగే ఉండాలని అనుకున్నాను...నా కూతురికి కూడా అదే చెప్పాను.. నా చివరి కార్యక్రమం కూడా ఇదే డ్రెస్ లో చేయాలి...అమ్మే కదా చీర కడతాను అంటే ఒప్పుకోవద్దు అని చెప్పాను" అన్నారు పేచీయమ్మాళ్. "నా కూతురు చెప్తూ ఉంటుంది..ఇన్నాళ్లు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావ్ అని అనుకున్నాను కానీ నువ్వు సంపాదించిన పేరే నాకు పెద్ద సంపాదన అమ్మా" అని అంటుందని చెప్పారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.