English | Telugu

Jayam Serial: రుద్రపై చెడుగా చెప్పిన వీరు.. ఆమెను శకుంతల బయటకి పంపిస్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -75 లో... వీరు దగ్గరకి ఇషిక వస్తుంది. నీకోక విషయం చెప్పాలని అంటుంది. రుద్ర అంటే మనకి ఇష్టం లేదు.. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి గంగని బయటకు గెంటేద్దామని చూస్తుంటే.. తను ఏకంగా ఈ ఇంటికి కోడలు అవ్వాలని చూస్తుందని, గంగ తనలో తాను మాట్లాడుకున్న విషయం వీరుకి చెప్పగానే అతను షాక్ అవుతాడు.

ఆ తర్వాత శంకుతల దగ్గరికి వీరు వచ్చి.. రుద్ర బావ మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. అందుకు గంగని వాడుకుంటున్నాడని వీరు చెప్తాడు. శకుంతలకి ఇంకా రుద్రపై కోపం కలిగేలా వీరు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు గంగని పంపిస్తానని చెప్పండి.. అందుకు రుద్ర అసలు ఒప్పుకోడు.. ఒప్పుకుంటే నేను చెప్పింది నమ్మకండి అని వీరు అంటాడు.

ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. మీరు కేక్ లో విషం కలిసిందని కంప్లైంట్ ఇచ్చారు కదా.. అందులో ఎవరో కావాలనే విషం కలిపారు.. బేకరిలో అది జరగలేదని పోలీసులు చెప్పి వెళ్తారు. మరి ఎవరు చేసి ఉంటారని పెద్దసారు అంటాడు.

ఇంట్లో వాళ్లే చేసి ఉంటారు.. ఈ మధ్య తప్పుని ఒప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని రుద్రను ఉద్దేశించి శకుంతల మాట్లాడుతుంది. నేను గంగని ఇంట్లో నుండి పంపించేస్తాను.. సేఫ్ ప్లేస్ లో పెడతానని శకుంతల అనగానే వద్దని రుద్ర అంటాడు.

తరువాయి భాగంలో చిట్టి, పారుకి పార్క్ లో గొడవ అవుతుంది. చిట్టి వెంటనే రుద్రకి ఫోన్ చేసి రమ్మంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.