English | Telugu

Jayam serial: గంగని చూసి రుద్ర షాక్.. గొడవచేసి ఆమెను తీసుకెళ్ళిన పైడిరాజు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో..... రుద్ర తన సూపర్ మార్కెట్ లో పని చేసే అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించి తీసుకొని వస్తాడు. నిన్న నువ్వు చనిపోతానన్నావ్ కదా చనిపోమని రుద్ర అనగానే అంటే నిన్న అలా అనిపించింది సర్ అని ఆ అమ్మాయి అంటుంది. అంత నీ ఇష్టమేనా నీకంటు కుటుంబం ఉంటుంది.. వాళ్ళ గురించి ఆలోచించవా.. బంధాలు దూరం అయి ఎంత బాధపడుతున్నామో మా కుటుంబా‌నికి తెలుసని రుద్ర ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత గంగ వర్క్ చేసుకుంటుంటే.. అప్పుడే గంగ వాళ్ళ నాన్న పైడిరాజు వస్తాడు.

గంగ మన ఇంటికి వెళ్లిపోదాం పద అని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్తుంటే రుద్ర వచ్చి ఆపుతాడు. ఇక్కడ గొడవ చెయ్యకు.. ఇది వర్కింగ్ అవర్ అని రుద్ర తనని బెదిరించి పంపిస్తాడు. ఇంకోసారి ఇలా వచ్చి గొడవ చేస్తే నీకు సూపర్ మార్కెట్ లో అడుగుపెట్టనివ్వమని గంగకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రుద్ర. నీ జాబ్ కి ఎలాంటి టెన్షన్ లేదు.. నువ్వు వర్క్ చేసుకోమని పెద్దసారు అంటాడు. మరొకవైపు గంగ ఇంటికి రాలేదని.. అతని భార్యని అడుగుతాడు. సూపర్ మార్కెట్ లో పని అయ్యాక పెద్దసారు వాళ్ళింట్లో పని చెయ్యడానికి తీసుకొని వెళ్తున్నారు.. అక్కడే ఉంటుందని ఆవిడ చెప్పగానే అది అక్కడ ఉంటే నేను అనుకున్నది ఎలా జరుగుతుందనుకుంటాడు పైడిరాజు. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళ సంగతి తేలుస్తానని వెళ్తాడు. పైడిరాజు వెళ్తుంటే వీరు మనిషి వచ్చి ఇప్పుడు కాదు.. రేపు ప్రొద్దున వెళ్లి అడగమని అతను అనగానే సరే అని పైడిరాజు అంటాడు.

మరుసటి రోజు ఉదయం పైడిరాజు రుద్ర ఇంటికి వెళ్తాడు. నా కూతురిని కిడ్నప్ చేసారంటు గొడవ పెడతాడు. ఎక్కడ రుద్ర బయటకు వస్తాడోనని అందరు టెన్షన్ పడుతాడు. గంగ లోపల దాక్కుంటుంది. పైడిరాజ్ గొడవ చేస్తుంటే నీ కూతురు ఇక్కడ ఎందుకు ఉంటుందని అతనిపైకి రుద్ర వెళ్తాడు. తరువాయి భాగం లో పైడిరాజుని రుద్ర కొడుతుంటే గంగ వస్తుంది. గంగని చూసిన రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత గంగని తీసుకొని పైడిరాజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ పెద్దమ్మ.. భాను అని అడిగితే ఏం చెయ్యాలని పెద్దసారు టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.