English | Telugu

క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన మల్లెమాల ఆర్టిస్ట్స్ టీమ్

జబర్దస్త్ టీంకి కొంచెం టైం దొరికేసరికి ఛిల్ల్ అవడానికి గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ఆడేశారు. జబర్దస్త్ యాక్టర్స్, మేనేజ్మెంట్ టీమ్, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని రౌడీ రోహిణి షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఇక ఇక్కడ కూడా వీళ్ళ పంచులు, కౌంటర్లు పేల్చారు. నాటీ నరేష్, యాక్టర్ బాబు కలిసి "అసలు వికెట్లు ఎన్ని ? కవర్ లో దాక్కుని డ్రైవ్ చేయడాన్ని కవర్ డ్రైవ్ అంటారు.. గార్డ్ అంటే ఏమిటో తెలుసా ? మొబైల్ కి వాడే గార్డ్ ని అలా పిలుస్తాం" అంటూ కామెడీ చేశారు. తర్వాత రోహిణి కాసేపు బౌలింగ్ వేసింది, తర్వాత బాటింగ్ కూడా చేసింది.

ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వర్ష కూడా వచ్చింది. తర్వాత సన్నీ గ్రౌండ్, ఆది ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగతా వాళ్లంతా సన్నీ మందుకొట్టి బాల్ వేస్తే అది ఎటో వెళ్తుంది అని ఫుల్ ఫన్ చేశారు. ఇక ఫైనల్ గా ఆర్టిస్టుల టీమ్ కి మేనేజర్స్ టీమ్ కి పోటీ బాగా జరిగింది. అందులో మేనేజర్స్ టీమ్ ఓడిపోయింది. ఇక క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని అడిగిన రోహిణికి "ఇదొక స్ట్రెస్ బస్టర్ కొంచెం రిలాక్సేషన్ కోసం" అని ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ ఐన శ్రీపాద చెప్పారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.