English | Telugu

'ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసొచ్చింది'.. ఎమోషనల్ అయిన శాంతిస్వరూప్!

'జబర్దస్త్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీదకూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేసే వారి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్లంతా క్యాష్ షోకి వచ్చారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కు జబర్దస్త్ స్త్రీ పాత్రధారులు శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి వచ్చారు.

శాంతి స్వరూప్ తన తల్లితో కలిసి ఈ షోకి వచ్చాడు. తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పిఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్. "మా అమ్మ చాలా ఇళ్లలో పాచిపని చేసేది. అప్పుడు ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసొచ్చింది" అని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.

"మా అమ్మకు చిన్నతనం నుంచి గొంతు సరిగ్గా రాదు, స్పష్టంగా మాట్లాడలేదు..ఏదో మాట్లాడాలనుకుటుంది కానీ మాట్లాడలేదు" అని చెప్పికన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ గురించి తల్లి సరోజనమ్మ మాట్లాడుతూ.. "నా కొడుకే నన్ను బతికిస్తున్నాడు. ఆస్పత్రుల చూట్టు తిప్పుతున్నాడు” అని కన్నీటి పర్యంతమైంది. దాంతో స్టేజి మీద ఉన్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.