English | Telugu
'రాజు ఎక్కడ ఉన్నా రాజే'!
Updated : Nov 8, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ఉంటారు. అందులో కొందరు అగ్రెసివ్ అయితే మరికొందరు కామ్ గా ఉంటారు. అయితే మొదటి వారం నుండి కామ్ గా ఉన్న రాజ్, గత రెండు వారాలుగా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు.ఆదిరెడ్డిని రేవంత్ నామినేట్ చేసాడు. "వాంటెడ్ గా అన్నారు. నేను హర్ట్ అయ్యాను." అని చెప్పాడు రేవంత్.
ఆ తర్వాత శ్రీహాన్ ని నామినేట్ చేసిన కీర్తి భట్, "లాస్ట్ నామినేషన్లో హ్యుమానిటి గురించి నామినేట్ చేసావ్. చాలు ఇక నువ్వు హీరో కాదు. ఇక్కడ హీరో, హీరోయిన్ లు ఎవరూ లేరు." అంది. తర్వాత శ్రీహాన్ "సరే బయల్దేరు" అనగా, "ఇది ఓవర్ అని అనిపించలేదా? ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా.. ఇదే తగ్గించుకో శ్రీహాన్" అంది కీర్తిభట్. తర్వాత ఇనయాని నామినేట్ చేసింది కీర్తి. "నువ్వు సారీ చెప్పావ్. అయినా అగ్రెసివ్‌నెస్ కొంచెం తగ్గించుకో." అని సలహా ఇచ్చింది.
ఆ తర్వాత ఇనయాను నామినేట్ చేసిన మెరీనా, "నువ్వు అలా చేయకుంటే మన టీం గెలిచేది" అని చెప్పింది. దానికి రిప్లైగా, "నేనేం ఆడుతానో, ఎలా గేమ్ ఆడుతానో ఎవరికి చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు" అఅంది ఇనయా. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసాడు రాజ్. "ఇనయా తీసావా అంటే నేను తీయలేదు అంది. మళ్ళీ లోపలికి వచ్చి ఆడిగితే తీసాను అన్నావ్. ఫస్ట్ నన్ను ఫినిష్ చేయనియ్. నువ్వు గేమ్ ఆడలేదు. జఫ్ఫా గేమ్ ఆడినవ్. నాకు తప్పు అనిపించింది కాబట్టి నేను అడుగుతున్నా" అన్నాడు రాజ్. తర్వాత సెకండ్ నామినేషన్ గా శ్రీహాన్ ని నామినేట్ చేసాడు.
అయితే నిన్న జరిగిన నామినేషన్లో రాజ్ చెప్పిన ప్రతీ పాయింట్ కరెక్ట్. దానికి అభిమానులు సైతం కనెక్ట్ అయిపోయారు. "రాజ్ అసలు మాట్లాడడు. కానీ మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడుతాడు. రాజు ఎక్కడ ఉన్నా రాజే " అని నాగార్జున గత వారం చెప్పాడు. ఇది నిజమనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా ఉంటూ తమకు అవకాశం వచ్చినప్పుడు వాడుకునే వాళ్ళలో రాజ్ మొదటగా ఉంటాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.