Read more!

English | Telugu

రష్మీకి స్వయంవరం..మరి సుధీర్ ఎక్కడ?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. సుధీర్ ఉన్నన్ని రోజులు రష్మీకి సుధీర్ కి ఏదో ఉందని గాసిప్స్ వచ్చాయి. ఎప్పుడైతే సుధీర్ షో నుంచి వెళ్లిపోయాడో అప్పుడు ఈ గాసిప్స్ కూడా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మీ ఒంటరిదైపోయింది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద "రష్మీ స్వయంవరం" పేరుతో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ స్వయంవరం ఎవరికీ అన్నట్టుగా చూస్తున్న రష్మీతో  "ఇదంతా ఎందుకో తెలుసా నేను నీకు స్వయంవరం అరేంజ్ చేసాను" అని ఇంద్రజ చెప్పి షాకిచ్చింది.

స్వయంవరం అనేసరికి రీసెంట్ గా తేజుని పెళ్లి చేసుకున్న అమరదీప్ గిఫ్ట్ తీసుకుని వచ్చేసరికి "పెళ్లయిపోయింది కదా ఎందుకొచ్చావ్ అని రాంప్రసాద్ అడిగాడు. ఎవరైనా రావొచ్చన్నారు అందుకే వచ్చా. మా నాన్న కూడా వస్తానన్నాడు...కానీ మా అమ్మ ఫీలవుతుందని రావొద్దని చెప్పా" అన్నాడు. ఆది, పండు, మరో కొరియోగ్రాఫర్ కలిసి రొమాంటిక్ సాంగ్ కి ఆపిల్ తింటూ డాన్స్ చేశారు. "అబ్బాయిలు కూడా రొమాంటిక్ సాంగ్స్ చేస్తారా..చేస్తే ఇంత బాగుంటుందా" అంటూ ఇంద్రజ ఆశ్చర్యపోయింది. ఇక కొత్త జంట రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఎంట్రీ ఇచ్చారు. తర్వాత రోల్ రైడ వచ్చి తన రాప్ సాంగ్స్ పాడి వినిపించాడు.

ఇక శ్రీరామనవమి వేడుకలను స్టేజి మీద సంప్రదాయబద్దంగా అంతా కలిసి చేశారు. నూతన వధూవరులు కాబట్టి రాకేష్, సుజాత దండలు మార్చుకున్నారు. అనంతరం శ్రీ రామదాసు జీవిత చరిత్రను స్కిట్ రూపంలో వేసి చూపించారు అమరదీప్ మరో బుల్లితెర నటి. రష్మీకి స్వయంవరం ప్రకటించినప్పుడు గాలోడు సుధీర్ కూడా రావాలి కదా అంటూ ఆయన ఫాన్స్ హోరెత్తించే కామెంట్స్ పోస్ట్ చేశారు.   ఇలా నెక్స్ట్ శ్రీరామా నవమి స్పెషల్ ఎపిసోడ్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించడానికి రాబోతోంది.