English | Telugu

ఆ బాధతోనే ఆస్పత్రిలో చేరిన అఖిల్!

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటుడు. బిగ్ బాస్ సీజన్ 4 లో, ఓటిటి వెర్షన్ లో రన్నరప్ గా నిలిచి బయటికొచ్చాడు. ఇప్పుడు బీబీ జోడి షోలో తేజుతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. ఏమయ్యిందో ఏమో కానీ అఖిల్ హాస్పిటలైజ్ అయ్యాడు. ఐతే అఖిల్ కి ఎప్పటినుంచో పొత్తి కడుపు కింద నొప్పిగా ఉందట. ఐనా పెద్దగా పట్టించుకోకుండా డాన్స్ చేస్తూ వచ్చాడట. ఐతే అది పెయిన్ ఎక్కువైపోయి డాన్స్ చేయలేని పరిస్థితికి వచ్చేసాడట. భరించలేనంత నొప్పి వచ్చేసరికి హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని చెప్పాడు. అది కాస్త ఎక్కువవడం, భరించలేనంత నొప్పిగా మారడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తాను, తేజు ఎంతో కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పాడు.

"నేను, తేజు అన్ని విధాలుగా మా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాం...అంత బాధలోనూ. అసలైన చెత్త విషయం ఏమిటంటే, నేను ఇంత బాధ పడుతూ డాన్స్ చేస్తున్న ఎవరూ నమ్మకపోవడం, ఇంకా నా వెనుక మాట్లాడ్డం నన్ను బాధ కలిగిస్తోంది. నేనేదో షో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నానని దానికి ఏదో వంక చెప్తున్నట్లుగా భావిస్తున్నారు. నేను నిజంగా షో నుండి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ ఎందుకు చేస్తాను. ఎందుకు ఇంతలా కష్టపడతాను !!" అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన హాస్పిటల్ వీడియో, డాక్టర్ మాట్లాడిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చేసాడు.

ఇక నెటిజన్స్ ఆయన ఫాన్స్ అంతా "బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావ్...టేక్ కేర్..ఎవరు ఏమనుకున్నా నువ్వు బాగా చేస్తున్నావ్..."అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ కూడా డాన్స్ చేయకూడదు బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి అని చెప్పారు డాక్టర్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.