English | Telugu

కైలాష్‌తో ఆట మొద‌లు పెట్టిన‌ య‌ష్!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం` సీరియ‌ల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్న ఈ సీరియ‌ల్‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ కీల‌క పాత్ర‌ధారులు.

కైలాష్.. వేద ఫొటోలు చూస్తున్న స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన య‌ష్ అత‌న్ని ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెడ‌తాడు. "సారిక తెలుసా?" అంటాడు. దానికి కైలాష్ "తెలుసు" అంటాడు. వెంట‌నే మాట మార్చి "వేద ప‌రిచ‌యం చేసింది" అంటాడు. అదంతా విన్న య‌ష్, "పెర‌ట్లో మొలిచింది పిచ్చి మొక్క అని తెలిసిన‌ప్పుడు దాన్ని పీకి పారేయాల్సిందే" అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ లో భ‌యం మొద‌ల‌వుతుంది. 'య‌ష్ ఏంటీ ఇలా మాట్లాడుతున్నాడు? సారిక గురించి తెలిసిపోయిందా?.. ఎందుకైనా మంచిది మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి' అనుకుంటాడు.

వెంట‌నే డౌట్ క్లియ‌ర్ చేసుకోవ‌డానికి సారిక‌కు ఫోన్ చేస్తాడు. "మ‌న విష‌యం గురించి ఎవ‌రైనా అడిగారా? లేక నువ్వే చెప్పావా?" అని బెదిరిస్తాడు. నేను ఎవ‌రితో చెప్ప‌లేద‌ని, నువ్వు చెప్పిన‌ట్టే చేస్తున్నాన‌ని సారిక ఏడుస్తూ చెబుతుంది. ఇదంతా చాటుగా వుండి విన్న య‌ష్ కు ర‌క్తం మ‌రిగిపోతుంది. ఎలాగైనా వీడిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుని వీడి ఆట క‌ట్టించాల‌ని ఆట మొద‌లు పెడ‌తాడు. వాడు ప‌క్క‌కి వెళ్లిపోగానే య‌ష్ వెళ్లి ఫోన్ చెక్ చేస్తాడు. ఆ త‌రువాత కైలాష్ రూమ్ కి వెళ్లి త‌న‌ని బెదిరించి బెదిరించ‌న‌ట్టుగా మాట్లాడి "నీ గురించి అంద‌రూ తెలుసుకుంటారు. మా అక్క కూడా" అంటూ వెళ్లిపోతాడు. దీంతో కైలాష్ మ‌రింత‌గా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.