Read more!

English | Telugu

హనీమూన్ గురించి చెప్పిన మంగళవారం రమేష్!

జబర్దస్త్ షో కొన్నేళ్ల క్రితం వరకు చాలా బాగుంది అనిపించింది. కానీ డబుల్ మీనింగ్ డోస్ మాత్రం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఈ షో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో తాగుబోతు రమేష్ కామెడీ కొంచెం హద్దులు దాటినట్టు కనిపిస్తోంది. స్కిట్ లో భాగంగా రమేష్ తన భార్యతో హనీమూన్ కి వెళుతున్నట్లు  చెబుతాడు. అందుకే "హ్యాపీ మూడ్" అని స్టేటస్ లో కూడా పెట్టుకుంటాడు. అయితే నా కల నెరవేరినట్లే మీరు నిజంగానే హ్యాపీ మూడ్ లో ఉన్నారా అండి అని భార్య రోల్ లో చేసిన కమెడియన్ అడిగేసరికి . హ్యాపీ మూడ్ చూశావు కానీ.. 

పక్కనే మంగళవారం అనే హ్యాష్ ట్యాగ్ పెట్టాను చూడలేదా అని అడుగుతాడు. ఆ డైలాగ్ కి స్పందించిన జడ్జి ఇంద్రజ "ఇకపై నీ పేరు తాగుబోతు రమేష్ కాదు మంగళవారం రమేష్" అని కౌంటర్ వేసింది. ఈ డైలాగ్ కి అక్కడున్న వాళ్ళందరూ నవ్వేస్తారు. 

తర్వాత హనీమూన్ అంటే ఏమిటి అంటూ రమేష్ ని వాళ్ళ ఆవిడ అడుగుతుంది..? గోవాలో బీచ్ ఒడ్డున పొట్టి నిక్కర్లు వేసుకుని అక్కడ మూన్ , ఇక్కడ చేతిలో హనీ ..మూన్ ని చూస్తూ హనీ నాకుతూ అంటాడు. ఇంతోటి దానికి గోవా వరకు వెళ్ళాలా అంటూ రమేష్ ని వాళ్ళ ఆవిడ కొడుతుంది. ఈ స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థమైపోతుంది.  ఒకానొక సమయంలో జబర్దస్త్ బూతు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయేసరికి ఆడియన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఫామిలీ మొత్తం  కలిసి చూసే ఇలాంటి కామెడీ షోస్ లో కూడా బూతు కామెడీ ఏమిటి అనే వాదన తెరపైకి వచ్చింది. ఇలాంటి విమర్శలు వస్తూండేసరికి టీం లీడర్స్ తమ రూట్ మార్చారు. జబర్దస్త్ లో బూతు కామెడీ తగ్గించారు క్లీన్ కామెడీ శాతం పెంచారు. దీంతో  ఆడియన్స్ నుంచి మళ్ళీ  ఎంతో  ఆదరణ పెరిగింది. కాని ఇప్పుడు మళ్ళీ అదే తరహా కామెడీ కనిపిస్తుండేసరికి ఆడియన్స్ నుంచి వ్యతిరేకత అనేది మొదలయ్యింది.