Read more!

English | Telugu

అవన్నీ నమ్మొద్దు.. అతడే నావాడు!

ఫేమస్ యాక్టర్ పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో  టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. కానీ నటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ లు చేస్తోంది.  బుల్లి తెరపై `ఢీ`, `జబర్దస్త్` తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నటి పూర్ణకు పెళ్లి కూడా కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూఏఈకి చెందిన బిజినెస్ పర్సన్ షానిద్‌ అసిఫ్‌ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. పూర్ణకి కాబోయే వరుడు జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్‌. జమా అల్ మెహరి అనే సంస్థని స్థాపించాడు. కొత్త ఆఫీస్ లు స్టార్ట్ చేయడానికి కావాల్సిన  సర్వీసులను వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 

అంతే కాకుండా సెలబ్రిటీలకు యూఏఈ వీసాలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు అసిఫ్ అలీ. వీసా ప్రాసెసింగ్‌ అలాగే ఫ్లైట్‌ టికెటింగ్‌ వంటి పలు సర్వీసులను కూడా షానిద్‌ కంపెనీ చూస్తూ ఉంటుంది. కాజల్‌, ప్రియమణి, ప్రణీత, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, శ్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి స్టార్లకు యూఎఈ వీసాలను కూడా ఏర్పాటు చేశారు. పూర్ణ ఎంగేజ్మెంట్ అయ్యాక తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఒక టాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఒక న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. 

ఐతే పూర్ణ ఈ న్యూస్ ఫేక్ అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా ఒక ఫోటోతో తన మీద వస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధం అని తెల్చిపారేసింది. లేటెస్ట్ గా ఈ వార్తలపై పూర్ణ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. షానిద్‌ అసిఫ్‌ అలీతో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి ‘ఫర్ ఎవర్ మైన్’ అంటూ కాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఈ ఒక్క కామెంట్ తో వైరల్ అవుతున్న న్యూస్ అంతా ఫేక్ అని చెప్పకనే చెప్పేసింది పూర్ణ. పూర్ణ హజ్బెండ్ కి యూఏఈ ముస్లిం మత పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పూర్ణ కుటుంబంతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. అలా పూర్ణతో తనకి  ఫ్రెండ్‌షిప్ ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది.