English | Telugu

నాగ్ సర్ ముద్దులిస్తుంటే నిద్రపట్టడంలేదు అన్న ఫైమా!

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే చాలా కూల్ కూల్ గా జరిగింది. చూస్తున్నంతసేపు చాలా టెన్షన్ గా అనిపించేసరికి మధ్యమధ్యలో డాన్స్, పాటలు, సరదా సెటైర్స్ తో ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.

ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ వీక్ నెస్ ని ఫన్నీగా చెప్పి నవ్వించారు కింగ్ నాగార్జున. మాజీ హౌస్ మేట్స్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని నాగార్జున ఆదిరెడ్డిని అడిగేసరికి ఇప్పటివరకు నేనే అనుకున్నా కానీ ఫైమా కూడా ఉంది అని ఆమె పేరు చెప్పాడు. దీనితో నాగార్జున బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఇచ్చేందుకు ఫైమాని వేదిక మీదకు పిలిచారు.

ఇక ఈ సీన్ చూస్తే ఎవ్వరైనా సరే పడీ పడీ నవ్వుకోకుండా ఉండరు. నాగార్జున ఫైమా చేయి పట్టుకుని ముద్దు ఇవ్వబోయారు. దీనితో ఫైమా ఒక్కసారిగా ఉలిక్కి పడి "అయ్యో వద్దు సర్.. మీరు ముద్దులు ఇస్తుంటే నాకు నిద్ర పట్టట్లేదు సర్" అని ఫైమా కామెంట్ చేసేసరికి అక్కడ అందరూ నవ్వేశారు. ఫైమా వెళ్ళేటప్పుడు కూడా నాగ్ ఆమె చేతిని పట్టుకుని ముద్దులివ్వడానికి ఎంతో ట్రై చేశారు కానీ తప్పించుకుని వెళ్ళిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.