English | Telugu
'జబర్దస్త్'కి ఆల్టర్నేట్ లేదు.. ఈ స్టేజి లేకపోతే మేం ఉండేవాళ్ళం కాదు!
Updated : Oct 9, 2022
బుల్లితెర మీద జబర్దస్త్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కామెడీ అనేది లేకుండా కేవలం సీరియల్స్ తో డ్రైగా నడుస్తున్న టైంలో జబర్దస్త్ ఒక తుఫానులా వచ్చి తెలుగు ఆడియన్స్ ని చుట్టేసింది. ఇక అప్పటి నుంచి ప్రతీవారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో కోసం ఆడియన్స్ వెయిట్ చేసేవారు. తర్వాత కొంత కాలానికి ఎక్స్ట్రా ఫన్ పేరుతో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. ఇది కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ 'ఎక్స్ ట్రా జబర్దస్త్' తాజాగా 400ల ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా టీం లీడర్లు, ఆర్టిస్టులు ఎక్స్ట్రా జోష్ తో వేదికపై స్కిట్లు, పంచులు పేల్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ 400 ఎపిసోడ్ లు పూర్తిచేసుకోవడం పై ఆర్టిస్టులు తమ అభిప్రాయాలను చెప్పారు. రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ "జబర్దస్త్ లేదు అని ఊహించుకోవడమే కష్టం. ఎందుకంటే దీనికి ఆల్టర్నేట్ లేదు మా ఆర్టిస్టుల లైఫ్ కి" అన్నాడు. అలాగే బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.." 12 కోట్ల మందిలో 12 మందికి ఈ స్టేజి పై అవకాశం లభించింది. అందులో నేనొకడిని కావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను" అని చెప్పాడు. తర్వాత కెవ్వు కార్తిక్ మాట్లాడుతూ.." జబర్దస్త్ నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. "జబర్దస్త్ స్టేజ్ వల్ల నేను ఓ స్టేజీలో ఉన్నాను. థ్యాంక్యూ జబర్దస్త్ " అని చెప్పింది రోహిణి. ఇక గెటప్ శ్రీను స్పందిస్తూ... "మొదట్లో జబర్దస్త్ మాకో అవకాశం.. ఇప్పుడు బాధ్యతగా మారింది" అంటూ చెప్పాడు. ఇక రష్మీ మాట్లాడుతూ "మాకు ప్రతీ ఎపిసోడ్ ఒక సినిమా లాంటిదే" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జబర్దస్త్ నుంచి ఎంతో మంది ఆర్టిస్టులు గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో కూడా నటిస్తుండడం విశేషం. ఎక్కడ బ్రేక్ లేకుండా ఇన్నాళ్లుగా ఈ జబర్దస్త్ కొనసాగడం గొప్ప విషయం కూడా.