English | Telugu

ధూమ్ ధామ్‌గా జీ ఫ్యామిలీ కిర్రాక్ పార్టీ!

జీ కుటుంబం అవార్డ్స్ 2022 కిర్రాక్ పార్టీ ధూమ్ ధామ్ గా జ‌రిగింది.దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కి బుల్లితెర సీరియల్స్ లో నటించేవాళ్లంతా వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. స్పెషల్ గెస్ట్ గా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్స్ గా సుడిగాలి సుధీర్ , శ్రీముఖి రచ్చ రచ్చ చేశారు. సుధీర్ ని చాలా రోజుల తర్వాత ఈ షోలో చూసేసరికి ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు "బతుకు జట్కాబండి" ఎంత ఫేమస్ షోనో అందరికీ తెలుసు ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో "ఉతుకు జట్కాబండి" అని పెట్టి అత్తాకోడళ్ల గొడవలకు పరిష్కారం చూపించేలా తన మాటలతో, కౌంటర్లు తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు పోసాని.

ఇక సీరియల్స్ వచ్చే కొన్ని ఫన్నీ బిట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్, మీమ్స్ తో ఎలా ఆడుకుంటున్నారో కొన్ని ప్లే చేసి చూపించారు. తర్వాత ఆనంది "దమ్మారో దమ్" అనే పాటకు బ్లాక్ డ్రెస్ లో వచ్చి అద్దిరిపోయే డాన్స్ చేసి స్టేజిని ఇరగొట్టేసింది. ఈమె డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. తర్వాత సుడిగాలి సుధీర్ వచ్చి తన కోసం ఒక పాట పాడమని ఆనందిని అడిగేసరికి "కమ్మని ఈ ప్రేమలేఖలు" అంటూ పాడింది.

ఇక తర్వాత సీరియల్స్హీరోస్ తో సుధీర్ టీ పెట్టే పోటీ పెట్టి ఎంటర్టైన్ చేసాడు. ఫైనల్ గా యశస్వి, ప్రణవ్ వచ్చి ఊపున్న పాటలు పాడి అందరూ ఊగిపోయేలా చేశారు. అదే టైములో శ్రీముఖి వచ్చి "బంగారం నీకెవరూ లేరా" అని యశస్విని అడిగేసరికి "నువ్వున్నావ్ కదా బంగారం" అని కౌంటర్ వేసాడు. ఇలా ఈ ఈవెంట్ అందరినీ అలరించడానికి ఈ ఆదివారం రాత్రి 6 గంటలకు జీ తెలుగులో రాబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.