English | Telugu

'జబర్దస్త్' వర్ష పెళ్లికి రెడీ? ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

'జబర్దస్త్' షోతో పాపులారిటీ దక్కించుకున్న వర్ష.. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా దర్శనమిస్తోంది. యాంకరింగ్ తో పాటు నటిగా కూడా రాణిస్తున్న ఈ బ్యూటీ తరచూ తన ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకున్న ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. తన చేతికి రింగు ధరించిన ఫోటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాకిచ్చింది వర్ష.

జూలై 4వ తేదీన ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని.. తెలిపింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎమోజీలను జత చేసింది.

దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ వర్ష పెళ్లి న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. మరికొందరేమో వర్ష పెళ్లి చేసుకుంటే ఇమ్మానుయేల్ ఏమైపోతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? లేక ఏదైనా ప్రోగ్రాం కోసం ఈ రకమైన ప్రమోషన్స్ చేస్తుందో తెలియాలంటే జూలై 4 వరకు ఎదురుచూడాల్సిందే!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.