English | Telugu

అనసూయ డ్రెస్సింగ్‌పై కామెంట్స్.. అలిగి వెళ్లిపోయిన యాంకర్!

యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పొట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను నెటిజన్లు టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి ట్రోల్స్ పై అనసూయ ఘాటుగా స్పందిస్తుంటుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది తన ఇష్టమని కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా ఆమె డ్రెస్సింగ్ పై యాంకర్ శివ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా 'జబర్దస్త్' షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ప్రతీవారం ఎవరో ఒకరిని స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చే హైపర్ ఆది.. ఈసారి యాంకర్ శివను తీసుకొచ్చాడు. టిక్ టాక్, యూట్యూబ్ స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివతో ఏదో స్కిట్ వేయించినట్లు ఉన్నాడు ఆది. అయితే స్కిట్ చివర్లో అనసూయను ఉద్దేశిస్తూ .. 'పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంతో మీ పై కామెంట్స్ వస్తుంటాయి కదా.. దీని గురించి మిమ్మల్ని ఎప్పటినుండో అడగలనుకుంటున్నా' అని ప్రశ్నించాడు.

దాని అనసూయ ''వాళ్లెవరో అన్నారంటే.. ఇండస్ట్రీ గురించి తెలియదని అనుకోవచ్చు.. కానీ మీరు ఇక్కడి వారే కదా.. మీరు అడగడం ఏంటి..? అయినా ఇది నా వ్యక్తిగత విషయం'' అని బదులిచ్చింది. వెంటనే శివ 'పర్సనల్ అయితే మీ ఇంట్లో వేసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని కౌంటర్ వేశాడు. దీంతో షాకైన అనసూయ స్టేజ్ మీద నుండి కిందకు వెళ్లిపోతూ ఆదిపై ఫైర్ అయింది. 'ఎవరెవరినో తీసుకొచ్చి.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా..?' అంటూ ఆదిపై కోప్పడింది. అయితే ఇదంతా నిజమా? లేక ప్రోమో కోసం ఇలా చేశారా..? అనేది తెలియాల్సివుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...