English | Telugu

మనకి అబ్బాయి పుడితే ముఖేష్, అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం!

బుల్లితెరపై కామెడీ షోల పేరుతో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి. 'జబర్దస్త్', 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ', 'కామెడీ స్టార్స్' ఇలా అన్ని షోలలో బూతులు దొర్లుతూనే ఉన్నాయి. దీంతో టీవీ కామెడీ షోల‌లో కామెడీ శ్రుతి మించుతోంద‌నే విమ‌ర్శ‌లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయనిర్ణేతలుగా ఉన్న 'కామెడీ స్టార్స్' షోలో తాజాగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్ విష్ణుప్రియ.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ అందాల ప్రదర్శన చేస్తూ రకరకాల భంగిమల్లో షాకిస్తుంటుంది. తాజాగా కామెడీ స్టార్స్ షోకి చీరతో వచ్చి కాస్త పద్ధ‌తిగా కనిపించింది. కానీ తన మాటలతో బూతు కామెడీ చేసి రెచ్చిపోయింది. అవినాష్‌తో కలిసి ఓ స్కిట్ చేసింది విష్ణుప్రియ.

''నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముఖేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే ముఖ్యవతి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాలా ముకాబులా అని డాన్స్ చేద్దాం'' అని అవినాష్ ని అడిగింది. "కూపీ.. నీ కళ్లలో కరువు కనిపిస్తుంద"ని విష్ణు ప్రియ అంటే.. "అయితే కరవక ముందే వెళ్లిపో.. ఈ ఫైర్ ఎఫైర్‌గా మారకముందే వెళ్లిపోండి ప్లీజ్." అని అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగ్‌ లతో రెచ్చిపోయాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...