English | Telugu
ఐ లవ్ యు ఇంద్రజా!
Updated : Oct 20, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక రాబోయే వారం "మళ్ళీ పెళ్లి" అనే కాన్సెప్ట్ తో ఈ షో ఫన్ క్రియేట్ చేయబోతోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ మధ్య కాలంలో చూస్తే గనక ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. షోస్ కి జడ్జెస్ గా వచ్చేవాళ్ళు తమ బెటర్ హాఫ్స్ కి స్టేజి మీద నుంచి, షోస్ నుంచి ఫోన్ చేయడం. క్యూట్ గా మాట్లాడుకోవడం. దాన్ని ప్రోమోలా కట్ చేసి సోషల్ మీడియాలో వదిలి వ్యూస్ సంపాదిస్తున్నారు.
ఇంతకుముందు జబర్దస్త్ లో ఖుష్భు తన భర్త సుందర్‌కు ఫోన్ చేసింది. ఇక ఇప్పుడు ఇంద్రజ వంతు వచ్చింది. రాబోయే వారం ఎపిసోడ్ లో "మళ్ళీ పెళ్లి" అంటూ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న కొంతమంది జంటలను తీసుకొచ్చి వాళ్లకు మళ్ళీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేశారు.
ఇక ఇంద్రజను రష్మీ, రాంప్రసాద్ స్టేజి మీదకు తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేయించారు. "సర్ బాగున్నారా.. ఈరోజు ఈ షోలో మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం. ఇంద్రజ మేడం మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు.." అని రష్మీ అన్నాక, రాంప్రసాద్ ఫోన్ తీసుకుని "మేడంకి ఒకసారి ఐ లవ్ యు చెప్తారా వినాలని ఉంది" అన్నాడు.
దాంతో ఆయన"ఒక్కసారేనా చెప్పేది" అంటూ "ఐ లవ్ యు ఇంద్రజ" అని ఎంతో క్యూట్ గా చెప్పేసారు. దానికి ఇంద్రజ సిగ్గుపడిపోయింది "ఐ లవ్ యు సో సో సో మచ్" అని రిప్లై ఇచ్చారు.