English | Telugu
ఇంద్రజ ఇంట్లో ఐటీ దాడులు!?
Updated : Nov 21, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ వారం థంబ్ నెయిల్స్ సెగ్మెంట్ భలే ఫన్నీగా సాగింది. "ఇంతమందికి దానాలు చేయడంతో ఇంద్రజగారి ఇంట్లో జరిగిన ఐటీ దాడులు" అనే థంబ్ నెయిల్ చూసి ఇంద్రజ షాకయ్యింది. మొదట ఆమెను చూసేసరికి ఎమోషనల్ఐనట్టు కనిపించింది కానీ వెంటనే "ఇన్ని దానధర్మాలు చేసినప్పుడు ఇంకా నా దగ్గర ఏముంటుంది అని ఐటీ దాడులు చేస్తారు. ఎవరికైనా సాయం కావాలని నాకు తెలిస్తే చేయగలిగింది చేస్తాను.. అంతే కానీ ఇదంతా నిజం కాదు" అని చెప్పింది.
ఇక తర్వాత మరో థంబ్ నెయిల్ చూస్తే "నరేష్ తన లోపం గురించి డాక్టర్ కి చెప్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసా" అనే ప్రశ్నకి నరేష్ నాటి ఆన్సర్ ఇచ్చాడు. ఈ థంబ్ నెయిల్ చూసేసరికి అందరి ఎమోషనల్ఫేసెస్ ని జూమ్ చేసి చూపించేసరికి నిజంగా ఏదైనా తేడానా అనిపించింది. కానీ అలాంటిది ఏం లేదు అని తర్వాత అర్థమయ్యింది.. ఇక నాటీ నరేష్ మాట్లాడుతూ "నేను ఇంక హైట్ పెరగనని డాక్టర్ చెప్పేసాడు.. దానికి నేను పెద్దగా ఫీల్ అవలేదు. .పెళ్లి చేసుకోవచ్చన్నారు.సో.. నేను ధైర్యంగా ఉన్నాను " అని కామెడీగా ఆన్సర్ చేసాడు.