English | Telugu
జీవితం రైల్వే స్టేషన్ లాటింది.. అవకాశాలు వచ్చి వెళ్లే రైళ్లలాంటివి..
Updated : May 4, 2023
బిగ్ బాస్ సీజన్ 6లో ఇనాయ సుల్తానా ఒక బ్లాస్ట్, ఒక సంచలనం. నెగిటివిటీకి పెట్టింది పేరు ఆమె . కానీ రోజులు గడిచేకొద్దీ ఆమెకు కూడా ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. ఇనాయ బోల్డ్ బిహేవియర్ కి జనాల ఫిదా ఇపోయారు. అప్పటివరకు ఎవరో తెలియని మనిషి బిగ్ బాస్ లో మెరవడంతో సోషల్ మీడియాలో ఆమె ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా అది చాలా తక్కువ టైంలోనే వైరల్ ఐపొతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ పెట్టింది. "జీవితం రైల్వే స్టేషన్ లాంటిది. అందులో అవకాశాలు అనేవి వచ్చే వెళ్లే రైళ్లలాంటివి. అందులో నువ్వొక నిమిత్తమాత్రుడివి మాత్రమే. పొరపాటున ఏదైనా అవకాశం మిస్ ఐతే అస్సలు బాధపడొద్దు...జీవితం మీద ఆశలు పోగొట్టుకోకు. ఎందుకంటే రైళ్లు వస్తూనే ఉంటాయి. అలాగే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి.
కాబట్టి వెయిట్ చెయ్యి...అంతేకాని తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు" అంటూ జీవితాన్ని చాలా చక్కగా చిక్కగా తన మాటల్లో చెప్పింది. రీసెంట్ గా ఊటీ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దగ్గర ఒక పోజ్ ఇచ్చి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి ఇలా కాప్షన్ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇనాయ టైటిల్ విన్నర్ అంటూ పెద్ద ప్రచారం జరిగింది. ఐతే ఫైనల్ కి ముందు ఎలిమినేట్ ఐపోయింది. అలా హౌస్ నుండి బయటకు వచ్చాక ఆమెకు పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. కానీ రీసెంట్ గా మాత్రం ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నటరత్నాలు" టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో ఇనాయ హీరోయిన్ గా నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.