English | Telugu
రాజ్ కి ముద్దు పెట్టేసిన కావ్య...
Updated : Dec 17, 2023
ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాం. కొత్త ఏడాదిలోకి మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇక బుల్లితెర మంచి కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఇప్పటినుంచే ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ ని మొదలు పెట్టేసింది. ఈ కాన్సెప్ట్ తో "మోస్ట్ అవైటెడ్ దావత్..మ్యాడ్" పేరుతో ఒక ఈవెంట్ స్టార్ మాలో రాబోతోంది. ఇందులో బ్రాహాముడి సీరియల్ హీరో, హీరోయిన్స్ రెచ్చిపోయారు. "సీరియల్ వెర్సెస్ రియల్" థీమ్‌తో ఈ ఈవెంట్ జరిగింది. సీరియల్ సెలబ్రెటీలంతా ఒకవైపు.. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని మరో వైపుకు కూర్చోపెట్టి రచ్చ చేశారు యాంకర్లు రవి, వర్షిణి. ఇక ఈవెంట్‌కి "బబుల్‌గమ్" మూవీ టీమ్, "బలగం" మూవీ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, ఇంద్రజ హాజరయ్యారు. ఐతే స్టేజ్ మీద మానస్‌ను గట్టిగా హగ్ చేసుకుని కావ్య ఒక ఘాటు ముద్దు పెట్టేసింది.
ఒకప్పుడు డాక్టర్ బాబు- వంటలక్క జోడి ఎంతగా పాపులర్ అయ్యిందో ఇప్పుడు కావ్య-రాజ్ జోడి బుల్లితెరపై ఆల్‌టైమ్ హిట్ జోడీల్లో ఒకటిగా చేరిపోయింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో, కామెడీ సీన్స్ లో ఇద్దరూ సమానంగా నటిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్ హిట్ కావడానికి వీళ్లిద్దరి రోల్ అని చెప్పొచ్చు.
ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ దేబ్జానీ మోదక్ అలియాస్ వేద, మౌనరాగం ఫేమ్ శివ్, బ్రహ్మముడి బ్యూటీలు హమీదా, దీపికతో పాటు మిగతా బుల్లితెర సెలబ్రిటీస్ అంతా కూడా సందడి చేశారు. ఇక రియల్ సెలబ్రెటీలుగా బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్లు శుభశ్రీ రాయగురు, భోలే షావలి, ఆట సందీప్, అశ్విని, టేస్టీ తేజతో పాటు మాజీ బిగ్‌బాస్ సెలబ్రెటీలు కూడా వచ్చేశారు. ఇక వీరితో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా గట్టిగానే గోల చేసింది. "ఇక్కడ ఉన్నది ఆట సందీప్, హమీద" అంటూ రవి పరిచయం చేసేసరికి కృష్ణ ముకుందా మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణా కౌంటర్ వేసింది " ఆట ఆడాలంటే ఆట అని పేరుకు ముందు పెట్టుకోవాలా" అనేసరికి అందరూ షాకైపోయారు. ఇలాంటి పంచులతో రకరకాల గేమ్స్ తో, డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఈ షో వచ్చేవారం అలరించడానికి రాబోతోంది.