English | Telugu
టాప్-5 లో ఉంటానని చెప్పావ్ కదా రేవంత్.. ఎమోషనల్ అయిన ఇనయా!
Updated : Dec 11, 2022
బిగ్ బాస్ హౌస్ లో నిన్న నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. ఏకాభిప్రాయంతో మొదలుపెట్టి, ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళేదెవరు? ఎవరి అభిప్రాయం వారు చెప్పండని అడిగాడు.
"శ్రీహాన్, రేవంత్, కీర్తీ మీరు చెప్పండి..ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారని అనుకుంటున్నారు" అని అడిగాడు నాగార్జున. "ఈ సారి రోహిత్ వెళ్తాడని అనుకుంటున్నాను" అని శ్రీహాన్ చెప్పగా, "ఇనయా బయటకు వెళ్తుందని అనుకుంటున్నాను" అని రేవంత్ చెప్పాడు. "రెడ్డి గారు బయటకు వెళ్తారని అనుకుంటున్నాను సర్" అని కీర్తి చెప్పింది.
అయితే ఇనయా, రేవంత్ ల మధ్య కొన్ని మాటలు ఎక్సేంజ్ అయ్యాయి. "ఈ సారి ఇనయా బయటకు వెళ్తుందని అనుకుంటున్నాను" అని రేవంత్ అనగానే, "నిన్ననే కదా నేను టాప్-5 లో ఉంటానని అన్నావ్. నీ మనసులో ఇంత ఉందా.. అంటే అక్కడ చెప్పింది అంతా అబద్దమా?" అని ఇనయా అడిగింది రేవంత్ ని.. దానికి అతను, "నేను అలా అనలేదు. నువ్వు మొన్న నా దగ్గరకొచ్చి అన్నావ్ కదా..'ఎలిమినేషన్ లో ఉన్నా కదా, భయం అవుతుంది అని' ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎప్పుడు అలా ఆలోచించడు" అని రేవంత్, ఇనయాతో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ "నీ మనసులో ఇంత పెట్టుకున్నావా" అని అంది.