English | Telugu
శ్రీహాన్ అసలు రంగు ఇదేనా.. రేవంత్ ఇప్పటికైనా రియలైజ్ అవుతాడా!
Updated : Dec 11, 2022
బిగ్ బాస్ లో మరో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఉండబోతుందా అంటే అవుననే చెప్పాలి. 'ప్రేక్షకుల ఓట్లను పక్కన పెడుతున్న బిగ్ బాస్' అంటూ గీతూ ఎలిమినేట్ అయిన రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తమ నిరసనను తెలిపారు. ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఇనయాని బయటకు పంపడానికి రంగం సిద్దమైనట్టుగా ప్రోమో తెలియజేస్తుంది.
అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చి హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా మాట్లాడాడు. ఇక "హౌస్ లో ఎవరు ఉండాలి? జనాలు వేరే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయకూడదు? మీకే ఎందుకు వేయాలి?" అని హౌస్ మేట్స్ ని అడిగాడు. ఇద్దరిని నిల్చోబెట్టి పోల్చి చూసుకోమన్నాడు. ఇక శ్రీహాన్ అసలు రంగు ఇప్పుడు రేవంత్ కి అర్థం అయింది. తన మనసులో మాట చెప్పమనేసరికి రేవంత్ ని నెగెటివ్ చేస్తూ రేవంత్ కన్నా నేనే తోపు అన్నట్టుగా మాట్లాడాడు శ్రీహాన్.
ఇక కంపేరింగ్ లో ఒక్కొక్కరుగా మాట్లాడారు. మొదట శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ మొదలుపెట్టారు. "నేను గేమ్ ఒక్కటే కాదు. ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తాను. ఎవరితోను కంపేర్ చేసుకోను. ఫస్ట్ వీక్ నుండి పెద్ద టాస్క్ వరకూ దేన్నీ వదలలేదు. సాధ్యమైనంత వరకు ఆడాను. విన్నర్ అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను" అని శ్రీహాన్ మాట్లాడగా, "అది శ్రీహాన్ ఫీలింగ్.. కానీ నాకు నేనే కాంపిటేటర్ సర్. నేను ఎవరితోను కంపేర్ చేసుకోను. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు నాకు నచ్చినట్టు ఉన్నాను.. ఉంటాను" అని రేవంత్ చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న రేవంత్, కీర్తిభట్ సేవ్ అయ్యి ఫినాలేకి అర్హత సంపాదించారు.