English | Telugu

ఇనయా చేతుల మీదుగా శ్రీహాన్ బర్త్ డే సెల‌బ్రేష‌న్‌!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న శ్రీహాన్, ఇనయా కలిసిపోయినట్టుగా అనిపిస్తోంది. దీనికి కారణం నిన్న జరిగిన శ్రీహాన్ బర్త్ డే వేడుకుల్లో ఇనయా ఆక్టివ్ పర్ఫామెన్స్.

అయితే నిన్న శ్రీహాన్ పుట్టినరోజు కావడంతో హౌస్ మేట్స్ అందరు అతనికి సర్ ప్రైజ్ ఇచ్చారు. హౌస్ లో ఇనయా దగ్గరుండి కేక్ ని తయారు చేసింది. కాగ మిగిలిన హౌస్ మేట్స్ అందరు కూడా అందులో పాల్గొని విషెస్ తెలిపారు. కాగా శ్రీహాన్, ఇనయా మధ్య వైరం తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న గేమ్ తర్వాత ఇనయా, శ్రీహాన్ తో "నువ్వు నన్ను నామినెట్ చేసావని, నేను నిన్ను చేశాను అంతే కాని నీ మీద నాకు ఏం కోపం లేదు. హౌస్ లో నువ్వు అందరికంటే బెస్ట్" అని చెప్పుకొచ్చింది. శ్రీహాన్ ఆ విషయానికే షాక్ లో ఉన్నాడు.

కాగా ఇనయా నాతో అలా అనడం ఏంటి అని, కేక్ తానే తయారు చేసింది. కాగా రేవంత్ కేక్ పై శ్రీహాన్ పేరు రాస్తుండగా, "శ్రీహాన్ కాదు చోటు అని రాయు" అని అనడంతో రేవంత్ ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న శ్రీసత్య అది విని, శ్రీహాన్ దగ్గరకెళ్ళి, "ఇనయా కేక్ మీద చోటు అని రాయమంది. నిన్ను చోటు అని‌ అంటోంది." అని శ్రీసత్య చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత "అలాగే కేక్ పై హార్ట్ సింబల్ వెయ్ " అని ఇనయాతో అనగా గీతు చెప్పింది. అలా అనేసరికి ఆశ్చర్యపోయింది గీతు. కేక్ పై హార్ట్ సింబల్ అని ఇనయా అనడంతో హౌస్ లో అందరు సంథింగ్ సంథింగ్ సంథింగ్ అనుకుంటున్నారు. "వీళ్ళు అందరు కలిసి నా కొంప ముంచేలా ఉన్నారు" అంటూ తనలో తానే అనుకున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత శ్రీహాన్ కి డ్రెస్ సెలక్ట్ చేసింది గీతు. అలాగే తన బంగారు గొలుసు శ్రీహాన్ మేడలో వేసింది. శ్రీహాన్ కేక్ కట్ చేసి మొదటగా ఇనయాకి తినిపించగా, అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరిచారు. ఆ తర్వాత అందరు శ్రీహాన్ కి ఒక్కొక్కరుగా కేక్ తినిపించారు.

కాగా ఇనయాతో మొదటి నుండి గొడవలు ఉన్నాయి. కాని శ్రీహాన్ పట్ల తను పుట్టిన రోజు వేడుకలో ఇనయా చూపించిన కేరింగ్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తోంది. వీళ్లిద్దరి మధ్య గొడవలు లేకుండా ఇలానే ఉంటే నామినేషన్లో ఇంట్రెస్ట్ గా ఉండవని ప్రేక్షకులు భావిస్తున్నారు. మునుముందు వీళ్ళ పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.