English | Telugu
కంటెస్టెంట్స్ తో ప్రతిజ్ఞ చేయించిన బిగ్ బాస్!
Updated : Oct 21, 2022
బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక టాస్క్ ని రద్దు చేసాడు బిగ్ బాస్. దాని తర్వాత ఫుడ్ కోసం ఇష్టపడ్డారు కంటెస్టెంట్స్, కాగా ఇప్పుడు అదే ఫుడ్ కోసం ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ప్రతిజ్ఞ చేసి చెప్పండి.
"నిన్నటిదాకా ఫుడ్ కోసం టాస్క్ లో పోటీ పడ్డారు. ఇప్పుడు హౌస్ లో ఉండడానికి పోటి పడండి. మీ పర్ఫామెన్స్ పట్ల నిరాశతో ఉన్న ప్రేక్షకులకు ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో? మీరు మీ అటని ఎలా మార్చుకుంటారో? అని ప్రతిజ్ఞ చేయండి. ఇకపై హౌస్ లో మీ నుంచి ఏం ఆశించాలో కూడా చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.
అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి మాటలతో ప్రతిజ్ఞ చేసారు. "ఈ హౌస్ లో రాజు అయినట్టువంటి బిగ్ బాస్ కి, రాణి అయినటువంటి గీతు ప్రతిజ్ఞ చేస్తోంది. ఏం అంటే అశేష ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని గీతు చెప్పగా, " ఈ హౌస్ లో ప్రతీ నిమిషం ఎంటర్టైన్మెంట్ ఇస్తానని, ఏ ఒక్కరిని నిరాశ పడేలా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. "శ్రీసత్య అనే నేను. బిగ్ బాస్ మరియు కోట్ల ప్రజల సాక్షిగా చెబుతున్నాను. నా వంద శాతం పర్ఫామెన్స్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూర్య, శ్రీహాన్, రేవంత్ ప్రతిజ్ఞ చేసారు. అలా అందరూ ఒక్కొక్కరు చాలా కాన్ఫిడెంట్ గా ప్రమాణం చేసారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరు తమ పర్ఫామెన్స్ తో బాగానే ఆడుతున్నారు.