English | Telugu

Illu illalu pillalu: కత్తిపట్టుకోవాల్సింది చేతులు కలుపుతున్నావంటే తేడా కొడుతుందిరా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-66 లో.. ధీరజ్, సాగర్ ఇద్దరు ప్రేమ, నర్మదలను వీపుపై ఎక్కించుకుని పందెంలో పోటీ పడతారు. అయితే ప్రేమను మోస్తూనే.. ఇంత పరువు ఉన్నావే ఏంటే రాక్షసి అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ.. నీ మీద ఎక్కినందుకు నాకు ఒళ్లు కంపరంగా ఉందిరా అని గిల్లి గిచ్చేస్తుంటుంది. చివరికి పోటీలో కూడా ధీరజ్, ప్రేమలే గెలుస్తారు. సాగర్, నర్మదలు రెండో స్థానంలో నిలుస్తారు. మా ఇద్దరు కోడళ్లు మా కుటుంబాన్నిగెలిపించారని తెగ సంబరపడిపోతుంది వేదవతి. అయితే తనని గిచ్చినందుకు ప్రేమను గట్టిగా గిచ్చుతాడు ధీరజ్. దానికి ఆమె పెద్దగా అరుస్తుంది. సరిగ్గా అప్పుడే భద్రవతి చూస్తుంది. ఆ రామరాజుగాడి కుటుంబంతో కలిసి పోవడం నేను భరించలేకపోతున్నాను. నువ్వు మమ్మల్ని చేసిన మోసాన్ని సహించలేకపోతున్నానని భద్రవతి రగిలిపోతుంది. ఇక ఆ తర్వాత తాడు లాగే కార్యక్రమం ప్రారంభమవుతుంది.

వేదవతి వర్సెస్ భద్రవతి కుటుంబాలు ఈ తాడులాగే పోటీలో పోటీపడతారు. మేమ్ గెలుస్తామంటే మేమ్ గెలుస్తామని శపథాలు చేసుకుని తాడుని చాలాసేపు సాగదీస్తూనే ఉంటారు. ఇక భద్రవతి కుటుంబంపై వేదవతి కుటుంబం గెలుస్తుంది. అయితే ఈ తాడులాగే ప్రాసెస్‌లో భద్రవతి పడిపోబోతుంటే వేదవతి పట్టుకుంటుంది. అక్కాచెల్లెల్లు ఒకర్నొకరు ఆప్యాయంగా చూసుకుంటూ గతంలోకి వెళ్తారు. ఒకర్నొకరు పట్టుకుని ఎమోషనల్ అవుతారు. అక్కా అని వేదవతి పిలవబోతుండగా ఛీ ఛీ అని చెల్లెలి ప్రేమను ఛీకొట్టి వెళ్లిపోతుంది భద్రవతి. ఇక రామరాజు ఫ్యామిలీ.. మేమే గెలిచాం.. మేమే గెలిచాం అని గెలుపు సంబరాల్లో తేలిపోతుంటారు. అది చూసి విశ్వ సహించలేకపోతాడు. కాసేపట్లో ప్రభల తీర్థం ప్రారంభం కాబోతుంది. ఆ ధీరజ్ గాడు ప్రభను ఎత్తుకుని పోటీలోకి వస్తాడు. వాడ్ని అక్కడే వేసేయడానికి ఇదే మంచి అవకాశం.. వాడు ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి అని రౌడీ గ్యాంగ్‌తో విశ్వ చెప్తాడు. వాడు మా కత్తి వేటు నుంచి తప్పించుకోలేడు.. వాడ్ని చంపేస్తామని ఆ రౌడీలు అంటారు.

ఇంతలో విశ్వకి ఎదురుపడతాడు ధీరజ్. అయితే విశ్వ.. హాయ్ బావా అని ధీరజ్‌ని పలకరిస్తాడు. ఏంటీ.. బావా అని నన్నేనా పిలిచేదని ధీరజ్ ఆశ్చర్యపోతాడు. అవును బావా.. నువ్వు నా మేనత్త కొడుకువి.. నా చెల్లెలి మొగుడివి. నువ్వు బావవే కదా బావా అని విశ్వ అంటాడు. ఏంట్రా తాడి చెట్టూ... మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని ధీరజ్ అనగా.. నువ్వు ఎలా తీసుకుంటే అలా.. ఎలా అర్థం చేసుకుంటే అలా.. నీకు హ్యాపీ సంక్రాంతి అంటూ విశ్వ చేయి అందిస్తాడు. రేయ్ తాడి చెట్టూ నాకు తేడా కొడుతుందిరా.. నువ్వు నాపై కోపంతో చేతిలో కత్తి పట్టుకుని తిరగాలి కానీ చేతులు కలుపుతున్నావంటే ఏదో ఉందని అంటాడు. పండగ చేస్కో బావా.. ఈ పండగ నీకు చాలా స్పెషల్.. పెళ్లి చేసుకున్నావ్ కదా.. ఈ సంక్రాంతి పండుగ.. మీ కుటుంబానికి చాలా ఏళ్లు గుర్తుండిపోద్ది.. ఆల్ ది బెస్ట్ బావా అని విశ్వ హెచ్చరించి వెళ్తాడు. వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు.. వీడి మాటల వెనుక మర్మం ఉందని ధీరజ్ అనుమానపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.