English | Telugu

Illu illalu pillalu : భాగ్యంకి చెమటలు పట్టించిన నర్మద.. ఆ ఇద్దరు జస్ట్ మిస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -228 లో...... భాగ్యం, ఆనందరావు ఇద్దరు చిన్న బండిపై వెళ్తుంటే ప్రేమ, నర్మద వాళ్ళని ఫాలో అవుతుంటారు. ప్రేమ, నర్మద తమని ఫాలో అవడం చూసిన భాగ్యం తన భర్తకి చెప్తుంది. ఆ నర్మద సామాన్యురాలు కాదు.. నువ్వు తనతో పెట్టుకోవద్దని చెప్పాను కదా అని భాగ్యం భర్త అంటాడు.

వాళ్ళు ఫాలో అవుతున్నారని బండి అక్కడ పడేసి సందులల్లో దాక్కుంటారు భాగ్యం ఆమె భర్త. ప్రేమ, నర్మద వాళ్ళు ఎక్కడి వెళ్ళారని వెతుకుతారు. ఈసారీ తప్పించుకున్నారు కానీ అసలు వదిలిపెట్టొద్దని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ నర్మదని తక్కువ అంచనా వేసాను.. అసలు వదిలిపెట్టొద్దని భాగ్యం అనుకుంటుంది. మరొకవైపు చందు ఒకదగ్గర డల్ గా కూర్చొని సేట్ వచ్చి బెదిరించింది గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సాగర్, ధీరజ్ వచ్చి.. ఏమైంది రా ఇక్కడ కుర్చున్నావని అడుగుతారు. ఏం లేదు రా అని సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు చందు. వీడేదో దాస్తున్నాడు అనిపిస్తుందని వాళ్లిద్దరూ అనుకుంటారు. వదిన, నువ్వు ఇప్పుడు ఒకే కదా అని సాగర్ ని అడుగుతాడు ధీరజ్. ఒకే నర్మదకి నేను అంటే చాలా ఇష్టం బ్రతిమిలాడడం బుజ్జగించడం ఉండదంటూ డబ్బా కొట్టుకుంటాడు. మరి ప్రేమ, నువ్వు ఒకే నా అని సాగర్ అడుగుతాడు. అది చాక్లెట్ కి ఏడ్చే రకం.. చిన్నపిల్ల నేనంటేనే గజగజలాడుతుందని ధీరజ్ అంటాడు. అది పెట్టే టార్చర్ కోసం నిన్ను పట్టుకొని ఏడవాలని ఉందని ధీరజ్ మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంటే ధీరజ్ ఆగి.. నువ్వు ఆలా వెళ్లడం కష్టంగా ఉంది సైకిల్ ఎక్కు అంటాడు. నేను సైకిల్ ఎక్కాలంటే నువ్వు తొక్కకూడదు.. నేను కూర్చుంటా నువ్వు తోసుకొని వెళ్ళాలని ప్రేమ అనగానే సరే అని ధీరజ్ అంటాడు. ప్రేమ కూర్చొని ఉంటే.. ధీరజ్ తోసుకుంటూ వెళ్లడం సాగర్ చూసి నవ్వుకుంటూ.. వీడిని చూసి ప్రేమ బయపడుతుందట అని నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.