English | Telugu

Jayam serial: రుద్రకి దొరికిన గంగ చెవికమ్మ.. అతను ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో......సూపర్ మార్కెట్ లో రుద్ర మీటింగ్ పెడతాడు. సేల్స్ ఎలా పెంచాలని రుద్ర వాళ్లకు గైడ్ చేస్తాడు. మరి ఈ మీటింగ్ కి గంగని ఎందుకు రమ్మన్నావవని రుద్రని పెద్దసారు అడుగుతాడు. గంగ బయటకు వెళ్లి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బయటున్న కస్టమర్స్ ని లోపలికి పంపిస్తుంది.

ఆ తర్వాత సరుకులు తీసుకొని గంగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూసి సరుకులు ఇవ్వడానికి వచ్చానని అమ్మతో గంగ చెప్తుంది. అప్పుడే పైడిరాజు బండిపై వస్తాడు. అంతేకాకుండా వాళ్లకు బట్టలు కూడా తీసుకొని వస్తాడు. నువ్వేదో కొంపముంచే పనే చేసి ఉంటావని గంగ వాళ్ళ అమ్మ తిడుతుంది. నాన్న నా కోసం బట్టలు తీసుకొని వచ్చాడు అని గంగ అవి తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు నాకొక మాట ఇవ్వాలని పైడిరాజు గంగతో అనగానే సరే అని గంగ అంటుంది. మరోవైపు ఆ రుద్ర రూమ్ ముందుగా గంగ వెళ్తుంటే తన చెవికమ్మ ఒకటి రుద్ర గదిలో పడిపోతుంది. రుద్ర స్నానం చేస్తుంటే గంగ తన గదిలోకి వచ్చి చెవికమ్మ కోసం చూస్తుంది. రుద్ర అంటే కోపం కాబట్టి ఒక పిల్లోని తీసుకొని రుద్ర అనుకొని కొడుతుంది.

అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి గంగ భుజంపై చెయ్ వేస్తాడు. తీరా చుస్తే వీరు.. నువ్వు ఈ గదిలో ఎందుకున్నావంటూ పంపిస్తాడు. ఆ తర్వాత రుద్రకి గంగ చెవికమ్మ గుచ్చుకుంటుంది. ఎవరు నా గదిలోకి వచ్చారని అందరిని అడుగుతాడు. ఎవరు రాలేదని రుద్ర వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.