English | Telugu

Illu illalu pillalu : ట్రైనింగ్ కోసం కోడలు నర్మద.. మామ రామరాజు ఒప్పుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -156 లో......ధీరజ్ తన నెల సంపాదన ఆరు వేలు తీసుకొని వచ్చి రామరాజుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అరువేలు మీ ఇద్దరికి సరిపోతాయా అని రామరాజు కోపంగా మాట్లాడుతాడు. ఒక అరు వేలు ఇవ్వడం ఏంటి ఏదో హాస్టల్ లో ఇచ్చినట్లు ఇంకా మావయ్య గారి ముందే తల ఎగిరేసి మాట్లాడుతున్నావ్ మరిది గారు.. మా ఆయన నెల కాగానే యాభై వేలు మావయ్యకి ఇస్తున్నాడు.. ఎప్పుడైనా అలా పొగరుగా మాట్లాడాడా అని ధీరజ్ ని బ్యాడ్ చెయ్యాలని చూస్తుంది శ్రీవల్లి.

నడిపి మరిది రైస్ మిల్ చూసుకుంటున్నాడు.. పైసా ఆదాయం లేదు.. చిన్న మరిది చదువుతున్నాడు ఖర్చు తప్ప ఆదాయం లేదు.. మా ఆయన డబ్బు ఇస్తున్నాడని శ్రీవల్లి అనగానే మా ఆయనకి జీతమిస్తే మీ ఆయన కంటే ఇరవై వేయిలు ఎక్కువే అని నర్మద అంటుంది. ధీరజ్ చదువు అవగనే అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకొని వచ్చి ఇస్తాడని ప్రేమ అంటుంది. దాంతో రామరాజు అందరిపై కోప్పడతాడు. ఇక వెళ్లిపోతున్న రామరాజు చేతిలో ధీరజ్ డబ్బు పెట్టి వచ్చే నెల ఎక్కువ ఇస్తానని చెప్తాడు. రామరాజు వెళ్ళిపోయాక.. ఏంటి బావ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని చందుతో శ్రీవల్లి అంటుంది. అదేం లేదని చందు అంటాడు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వెళ్లి మాట్లాడుతుంది. మీ నాన్నతో అలా ఎందుకు మాట్లాడావని అడుగుతుంది. ఇంట్లో అందరు సంపాదిస్తున్నారు వాళ్ళ భార్యలకి గౌరవం ఉంటుంది. నా భార్య కి గౌరవం ఉండాలనే ఇలా చేస్తున్నాను.. ప్రేమ నా భార్య.. నా బాధ్యత అని ధీరజ్ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ప్రేమ విని మురిసిపోతుంది.

ఆ తర్వాత వేదవతి దగ్గరికి నర్మద వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. మీ అయన గురించి ఏదో చెప్పారట అని నర్మద అనగానే.. ప్రేమ సిగ్గుపడుతుంది. తరువాయి భాగంలో నర్మద ట్రైనింగ్ సంగతి మావయ్యకి చెప్పండి అని నర్మద, ప్రేమ కలిసి వేదవతిని రిక్వెస్ట్ చేస్తారు. శ్రీవల్లి రావడంతో టాపిక్ మారుస్తారు. ఆ తర్వాత రామరాజుతో నర్మద ట్రైనింగ్ గురించి వేదవతి మాట్లాడుతుంది. మావయ్య గారు అసలు ఒప్పుకోరని శ్రీవల్లి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.