English | Telugu

Illu illalu pillalu : ధీరజ్ కి దగ్గరవుతున్న ప్రేమ.. వాళ్ళిద్దరిపై కోపంగా ఉన్న రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -151 లో.....ప్రేమ , ధీరజ్ ఆటోలో ఇంటికి వస్తుంటే.. అదేంటి బైక్ పై వస్తున్నారని చెప్పారు.. ఆటోలో వచ్చారేంటని ధీరజ్ ని రామరాజు అడుగుతాడు. బైక్ ట్రబుల్ ఇచ్చింది. అందుకే పక్కన పెట్టి ఆటోలో వచ్చామాని ధీరజ్ చెప్తుంటే.. నీకు బాధ్యత తెలియదు.. ఏం తెలియదంటూ ధీరజ్ ని తిడతాడు రామరాజు. అలా తిడుతుంటే శ్రీవల్లి నవ్వుతుంది. అలా నవ్వడం ప్రేమ చూసి బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది.

ప్రేమకి బాగోలేదు.. అందుకే ఇలా ఆటోలో వచ్చామని దీరజ్ చెప్తాడు. అయ్యో అవునా సరే వెళ్లి ప్రేమని చూసుకోమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఇలా అందరిముందు వాడిని తిట్టారు. వాడి భార్య ఫీల్ అవుతుందని రామరాజుతో అంటుంది వేదవతి. నా కొడుకుకి బాధ్యతలు చెప్పడం నా బాధ్యత అని రామరాజు అనేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాగర్ కి ఫోన్ చేస్తుంది నర్మద. ఈవినింగ్ రెస్టారెంట్ కి వెళదామని నర్మదకి సాగర్ చెప్తాడు. రామరాజు దగ్గరికి సాగర్ వచ్చి.. నాన్న నాకు రెండు గంటలు పర్మిషన్ కావాలి.. నర్మద తో రెస్టారెంట్ కి వెళ్తానని అడుగుతాడు. ఇప్పుడు వద్దు మిల్ లో వర్క్ ఉందని అంటాడు. దాంతో సాగర్ డిస్సపాయింట్ అవుతాడు.

ఆ తర్వాత ప్రేమ బాధపడుతుంటే వేదవతి వచ్చి మాట్లాడుతుంది. ధీరజ్ ప్రేమ కోసం కొబ్బరి బొండాలు ఇంకా టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఎందుకు నువ్వు కష్టపడుతూ ఇవ్వన్నీ ఎందుకు తెచ్చావని ప్రేమ అడుగుతుంది. నువ్వు నా బాధ్యత అని ధీరజ్ అంటుంటే.. అతడి వంక ప్రేమగా చూస్తుంది ప్రేమ. మరోవైపు సాగర్ కోసం నర్మద వెయిట్ చేస్తుంది. తరువాయి భాగంలో సాగర్, నర్మద ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అనుకోకుండా రామరాజు కూడ వెళ్తాడు. అక్కడ వాళ్ళని చూసి సాగర్ కి కాల్ చేస్తాడు. కానీ అతను లిఫ్ట్ చెయ్యడు. నేను వద్దన్నా వచ్చారని రామరాజు కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.