English | Telugu
ఆయన్ని అవమానించిన ఆ స్టేజి మీదకు నేను వెళ్ళేది లేదు!
Updated : Jan 18, 2023
"అన్ స్టాపబుల్" షో ఆహాలో ప్రసారమవుతూ ఆడియన్స్ క్రేజ్ ని సంపాదించుకున్న షో. హోస్ట్ గా బాలకృష్ణ ఈ షోని మంచిగా రక్తి కట్టిస్తున్నారు. పార్టీలకతీతంగా సెలెబ్స్ ని ఇన్వైట్ చేసి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి సందడి చేస్తున్న షో ఇది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయ్యేసరికి సీజన్ 2 కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి రోజాకి ఇప్పటికే రెండు సార్లు ఇన్విటేషన్స్ అందాయి.
ఐతే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినా వెళ్ళేది లేదు అని ఆమె తేల్చి చెప్పేసారు. ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారో ఆ క్షణమే ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడుని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి చనిపోయిన ఎన్టీఆర్ గారిని మరోసారి అవమానించేలా మాట్లాడటం ఒక ఆర్టిస్ట్ గా తనకు ఎంత మాత్రమూ నచ్చలేదు అని చెప్పారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే దేవుడి లెక్క అలాంటి మహా నటుడిని అవమానించి కించ పరిచిన ఆ స్టేజి మీదకు వెళ్లాలని తనకు లేదని చెప్పారు మంత్రి రోజా.