English | Telugu

శ్రీ‌నివాస‌రెడ్డితో గొడవ.. గిల్టీ ఫీల‌వుతున్న రాకెట్ రాఘవ!

'జబర్దస్త్' కామెడీ షోలో చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోన్న రాకెట్ రాఘవ క్లీన్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయనతో పాటు 'జబర్దస్త్' షోకి వచ్చిన చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు ఆ షోలో లేరు. కానీ రాఘవ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. సినీ నటుడు శ్రీనివాసరెడ్డికి 'జబర్దస్త్' కమెడియన్ రాఘవకు మధ్య విభేదాలు ఉన్నాయంట. ఆ విషయాన్ని రాఘవ స్వయంగా వెల్లడించారు.

తనకు తెలియకుండానే శ్రీనివాసరెడ్డిని నొప్పించానని.. ఇప్పటికీ ఆ విషయంలో చాలా గిల్టీగా ఉంటుందని అన్నారు. శ్రీనివాసరెడ్డి 'నవ్వుల సవాల్' అనే కామెడీ షోను హోస్ట్ చేస్తుండేవారు. ఆ షో డైరెక్టర్ రాఘవ పక్కింట్లో ఉండేవారట. ఒకరోజు ఆయన రాఘవని పిలిచి షో చేస్తావా అని అడిగితే వెంటనే ఓకే చెప్పేశారట. షూటింగ్ చేస్తూ ఉండగా.. శ్రీనివాసరెడ్డి వచ్చారట.

తన స్థానంలో రాఘవను చూసిన శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడకుండా అక్కడనుండి వెళ్లిపోయారట. ఆ తరువాత ఒకరోజు బయట కలిసిన శ్రీనివాసరెడ్డి.. తను చేస్తోన్న షో ఎలా ఇచ్చారంటూ రాఘవను ప్రశ్నించారట. యాంకర్ ను మారుస్తున్న విషయం తనతో చెప్పలేదని.. కనీసం నువ్ అయినా చెప్పాలి కదా అంటూ అడిగేసరికి రాఘవ బాగా గిల్టీ ఫీల్ అయ్యారట. తమ ఇద్దరి మధ్య ఇలాంటి సంఘటన జరిగినా.. శ్రీనివాసరెడ్డి తన మనసులో ఏం పెట్టుకోలేదని.. ఎక్కడైనా షూటింగ్ లో కనిపిస్తే ఫ్రీగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...