English | Telugu

రిమోట్ అంత లేవు నువ్వేం ప్రమోట్ చేస్తావ్ నరేష్ మీద నిహారిక ఫైర్

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం అలరించి వెళ్ళిపోయింది. ఇందులో నిహారిక వచ్చి ఆదితో పోటాపోటీగా పంచులు పేల్చి స్టేజిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. హలో వరల్డ్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ కోసం ఆ టీమ్ మొత్తం వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ ని భలే వెరైటీగా ఒక స్కిట్ రూపంలో చేశారు ఆది, నిహారిక. అందరికి హాయ్ చెప్పండి అంటాడు ఆది. హలో వరల్డ్ అని అరుస్తుంది. దాంతో ఆది ఎవరైనా హలో చెప్తారు మీరేంటి హలో వరల్డ్ అంటున్నారంటాడు. నా సిరీస్ ని ప్రోమోట్ చేసుకోవద్దా అంటూ కౌంటర్ ఇస్తుంది. బాకీలు ఇవ్వాల్సిన సుబ్బారావు, వెంకట్రావు ఎప్పుడు ఇస్తాను అన్నారు అని ఆది అడిగేసరికి అందరూ శుక్రవారం ఇస్తారట అని చెప్తుంది నీహా. అదేంటి శుక్రవారం అనేసరికి. మరి శుక్రవారం కదా సిరీస్ రిలీజ్ అయ్యింది అంటుంది. మరి నాగేశ్వరావు డబ్బులిచ్చాడా అంటుంది నీహా.. వాడు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఇస్తానన్నాడు అనేసరికి అదేం టైం అని అడుగుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇస్తాడట అని ఫన్ చేస్తాడు.

మధ్యలో ఆటో రాంప్రసాద్ వచ్చి హిట్ డబ్బా నిహారికకు ఇచ్చి మీ సిరీస్ హిట్ కావాలని గిఫ్ట్ అని చెప్తాడు. నా సిరీస్ కంటే మీ షోకి ఈ హిట్ అవసరం అని తిరిగి ఇచ్చేస్తుంది. ఇంతలో ఇమ్ము వచ్చి వర్ష, ఇమ్ము లవ్ ట్రాక్ చూసారా అంటూ నిహారికకు అడిగేసరికి ఖాళీగా ఉన్న రైల్వే ట్రాక్ ని ఐనా చూస్తా కానీ మీ లవ్ ట్రాక్ చూడను అంటుంది. వర్ష మూతి ముడుచుకుంటుంది. నన్ను హీరోని చేయమని బాబు గారికి చెప్పండి అనేసరికి హీరో అంటే నీ బాబే ఒప్పుకోడు, ఇంక నా బాబు ఎలా ఒప్పుకుంటాడు అనేసరికి ఇమ్ము హర్ట్ అయ్యి సారీ చెప్పేస్తాడు. ఇంతలో నాటీ నరేష్ వచ్చి మీ సిరీస్ ని నేను ప్రమోట్ చేస్తా అంటాడు నిహాతో. రిమోట్ అంత లేవు నా సిరీస్ ని ఎం ప్రమోట్ చేస్తావ్ అంటుంది. టీవీ ఆన్ అవ్వాలంటే రిమోట్ ఉండాల్సిందే అంటాడు నరేష్. ఇలా వీళ్ళ స్కిట్ అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.