English | Telugu
హీరోయిన్ శ్రీలీలపై మనసు పారేసుకున్న హైపర్ ఆది!
Updated : Dec 20, 2022
"ధమాకా" మూవీ హీరోయిన్ శ్రీలీల మీద మనసు పారేసుకున్నాడు హైపర్ ఆది. ఆమెపై ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇది. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది.
ఇప్పుడు రీసెంట్ గా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ మూవీలో హైపర్ ఆది ఒక పాత్రలో నటించాడు. ఆయన స్టేజి మీద హీరో రవితేజ గురించి మాట్లాడాక హీరోయిన్ శ్రీలీల మీద హాట్ కామెంట్స్ చేసాడు. “సినిమాలో శ్రీలీల నటన పీక్స్ లో ఉంటుంది అందరికి నచ్చుతుంది. బేసిగ్గా లవర్ లేనివాడు ఈ సినిమా చూస్తే.. శ్రీలీల లాంటి లవర్ ఉంటే బాగుండు అనుకుంటాడు. లవర్ ఉన్నోడు ఈ అమ్మాయిని చూస్తే ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది" అని అనుకుంటాడు. "ఎవరికైనా శ్రీలీలని చూస్తే అలాగే అనిపిస్తుంది..నాకూ అంతే.
తెలుగులో ఇంత మంచి ఆర్టిస్ట్ దొరకడం మామూలు విషయం కాదు. రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అందుకుంటుంది అనిపిస్తుంది” అంటూ శ్రీలీలని ఆకాశానికెత్తేసాడు హైపర్ ఆది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల.. ‘పెళ్లి సందడి’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది.