English | Telugu

సుధీర్ అక్కడ..రష్మీ ఇక్కడ..వన్ ఇయర్ ఆషాఢం ఆఫర్ అంటూ ఆది కామెంట్స్


ప్రతీ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ తో పోటీ పడుతూ టాప్ రాంక్ లో దూసుకుపోతోంది. ఇక రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఆషాఢమాసం మొదలైన సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆషాఢం అల్లుళ్ళు పేరుతో చేసిన ఎపిసోడ్ ప్రోమో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఇక ఈ షోకి ప్రగతి గెస్ట్ గా వచ్చి రచ్చ చేసింది. ఇక ఆసియా, నూకరాజు, గీతాసింగ్, హైపర్ ఆది, వర్ష, ఇమ్మానుయేల్ జంటలుగా వచ్చి పెర్ఫార్మ్ చేశారు. మేం మా భార్యల దగ్గర ఫిట్ గా ఉండాలంటే ప్రగతి గారు ఓ రెండు ఎక్సరసైజులు చెప్పండి అంటూ ఆది అడుగుతాడు. ఆ తరువాత " కుర్రాడు బాబోయ్" అనే పాటకు ఆది, ప్రగతి,. ఆటో రాంప్రసాద్ డాన్స్ చేసి స్టేజిని మంచి ఎనర్జిటిక్ గా మార్చేశారు.

వర్ష వచ్చి "రష్మీ అక్కా నువ్వు కూడా ఆషాడానికి వచ్చావ్ కదా మరి బావేమో అక్కడున్నాడు కదా " అంటూ సుధీర్ లేకపోయినా తన ప్రస్తావన తెచ్చి మరీ రష్మీని ఏడిపిస్తుంది వర్ష. "ఎవరే నీకు అక్క" అంటూ వర్ష మీద ఫైర్ అవుతుంది రష్మీ. ఐనా "రష్మీ నీకు సుధీర్ కి సంవత్సరం ఆషాడం అనుకుంటా కదా" నువ్విక్కడ..ఆయనక్కడ అనే అర్ధం వచ్చేలా అంటూ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఆది మళ్ళీ తవ్వి తీసాడు. ఇక చివరిగా ఆది కళ్ళకు, అత్తల కళ్ళకు గంతలు కడుతుంది రష్మీ. ఆది నువ్విప్పుడు అత్తలను వెతికి మరీ కొట్టాలి అనేసరికి "అత్తా అంటూ రష్మినే పిచ్చ కొట్టాడు కొడతాడు"...ఇలా ఈ వారం పంచ్ డైలాగ్స్ తో, అదిరే స్కిట్స్ తో ఆషాఢం అల్లుళ్ళు ఎపిసోడ్ శ్రేదేవి డ్రామా కంపెనీలో ఆడియన్స్ ని అలరించబోతోంది.